close
మరోసారి అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తు

హీరా, రెండు ఇతర సంస్థలవి సైతం

ఈనాడు, అమరావతి: ఆకర్షణీయ పథకాల పేరిట ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి, బోర్డు తిప్పేసిన పలు మోసకారి సంస్థల స్థిర, చరాస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. అగ్రిగోల్డ్‌ ఫార్మ్‌ ఎస్టేట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థలు, హీరా గ్రూపు కంపెనీలు, సోనాల్‌ భూమి నిర్మాణ అండ్‌ ఫార్మ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇండిట్రేడ్‌ క్యాపిçల్‌ లిమిటెడ్‌ సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్‌కుమార్‌ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి ఇప్పటికే పలు విడతలుగా ఆస్తులు జప్తు చేసిన ప్రభుత్వం... సీఐడీ దర్యాప్తులో తాజాగా వెలుగుచూసిన 25,917 చదరపు గజాల స్థలాలు, 56.85 ఎకరాల భూమి, 56,407 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.
* బంగారం, వస్త్రాలు, ఫ్యాన్సీ వ్యాపారం ముసుగులో ప్రజల్ని మోసగించిన హీరా గ్రూపు కంపెనీల సీఈవో షేక్‌ నౌహీరాకు చెందిన 524.49 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థపై కలకడలో తొలి కేసు నమోదవగా ప్రభుత్వం దాన్ని సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
* సోనాల్‌ భూమి నిర్మాణ అండ్‌ ఫార్మ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం పాతమల్లంపేటలో రూ.88.78 లక్షల విలువైన 13.34 ఎకరాల భూమిని ప్రభుత్వం జప్తు చేసింది. ఈ సంస్థపై తొలుత విశాఖ జిల్లా పెందుర్తిలో కేసు నమోదైంది.
* ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ పేరిట ప్రజలను మోసగించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన టంకాల శ్రీరామ్‌కు చెందిన రూ.1.65 కోట్ల విలువైన 27.08 ఎకరాల భూములతోపాటు రూ.11.62 లక్షల విలువైన 435 గ్రాముల ఆభరణాలు, రూ.12 లక్షల విలువైన వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.