close
మదీనాలో ఘోర ప్రమాదం

భారీ వాహనాన్ని ఢీకొన్న బస్సు
35 మంది యాత్రికుల మృతి
మరో నలుగురికి తీవ్ర గాయాలు

రియాద్‌: ముస్లింల పవిత్ర నగరం మదీనా సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ యాత్రికులతో మదీనా నుంచి మక్కాకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు... బుధవారం సాయంత్రం అల్‌-అఖాల్‌ వద్ద భారీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి బస్సు దగ్ధమయ్యింది. అందులో ప్రయాణిస్తున్న 35 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా అరబ్బులు, ఆసియా ప్రాంతానికి చెందినవారేనని సమాచారం. ఈ ప్రమాదంపై  ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.