
ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం
యూనిట్ల ఏర్పాటుకు రాయితీలు
త్వరలోనే ప్రభుత్వ విధివిధానాలు
ఈనాడు, అమరావతి: ఇసుక లభ్యత తక్కువగా ఉండటం, గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా రాతి ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కంకర క్వారీలు ఉండటంతో వీటిద్వారా రాతి ఇసుకను సిద్ధం చేయించి, అవసరమైన వారికి సరఫరా చేయడంపై దృష్టి పెట్టింది. దీని ఉత్పత్తి దారులకు సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో రాతి ఇసుకను ఎక్కువగా వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ వివిధ నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థలు రెడీమిక్స్‌లో నది ఇసుకకు బదులు దాదాపు సగం మేరకు రాతి ఇసుకను వాడుతున్నారు. దీనివల్ల నిర్మాణాలు మరింత పటిష్ఠంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది రాతి ఇసుకను వాడేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తే..
* రాష్ట్రంలో 1,700కుపైగా కంకర క్వారీ లీజులు ఉన్నాయి. వాటివద్ద ఉన్న క్రషర్ల ద్వారా కంకరను వివిధ సైజుల్లోకి మారుస్తారు. అక్కడే రాతిని ఇసుక సైజులో మార్చేందుకు కొత్తగా యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున కొంత రాయితీ, విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నారు.
* ప్రస్తుతం విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 10 వరకు రాతి ఇసుక తయారు చేసే యూనిట్లు ఉన్నాయి. వీటి సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
* వచ్చే మంత్రివర్గ సమావేశంలో రాతి ఇసుకకు సంబంధించి విధివిధానాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- భారత్‌పై వెస్టిండీస్ విజయం