close
‘అయోధ్య రామాలయ ట్రస్టు’ ఏర్పాటుపై కేంద్రం కసరత్తు షురూ

దిల్లీ: సుప్రీంకోర్టు సూచించిన ‘అయోధ్య రామాలయ ట్రస్టు’ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ఆరంభించింది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై శనివారం అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆ స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ, మసీదు నిమిత్తం ఐదెకరాల స్థలం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక ట్రస్టును ఏర్పాటుచేసి, రామాలయ నిర్మాణ బాధ్యతను దానికి అప్పగించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో... అధికారుల బృందం సోమవారం సుప్రీం తీర్పుపై అధ్యయనం ఆరంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ట్రస్టు ఏర్పాటుకు ఎలా ముందుకెళ్లాలి? ఆలయ నిర్మాణ విషయంలో సాంకేతికంగా అనుసరించాల్సిన పద్ధతులేంటి? అన్న అంశాలపై న్యాయశాఖ, అటార్నీ జనరల్‌ అభిప్రాయాలను వారు కోరనున్నట్టు సమాచారం. ఈ ట్రస్టు సమన్వయ బాధ్యతలను కేంద్ర హోంశాఖ, లేదంటే సాంస్కృతిక శాఖకు అప్పగించే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

ఉత్తరాఖండ్‌లో సీతాదేవి భారీ ఆలయం
దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని పౌడి జిల్లాలో సీతాదేవి సమాధి అయినట్లుగా భావించే చోట ఆమె పేరిట భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తెలిపారు. సోమవారం పౌడిలో శీతాకాల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.