close
శాసనమండలి, శాసనసభ సంయుక్త కమిటీల నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శాసనమండలి, శాసనసభ సంయుక్త కమిటీలను నియమిస్తూ శాసనమండలి ఛైర్మన్‌, శాసనసభాపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం తొమ్మిది కమిటీలను నియమించారు. అందులో ఛైర్మన్‌తో సహా శాసనసభ, శాసనమండలిల నుంచి సభ్యులను నియమించారు.అలాగే వివిధ అంశాలపై శాసనమండలి కమిటీలను నియమిస్తూ బుధవారం మండలి ఛైర్మన్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ ఉత్తర్వులు జారీ చేశారు

సదుపాయాల కమిటీ
ఛైర్మన్‌గా సభాపతి తమ్మినేని సీతారాం, శాసనసభ నుంచి సభ్యులుగా అన్నాబత్తుని శివకుమార్‌, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తొగురు ఆర్థర్‌, దుద్దుకుంట్ల శ్రీధర్‌రెడ్డి, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, బొత్సా అప్పలనరసయ్య, జి.శ్రీనివాస్‌నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, శాసనమండలి నుంచి సభ్యులుగా బుద్ధా వెంకటేశ్వరరావు, వట్టికూటి వీర వెంకన్నచౌదరి, కేఎస్‌.లక్ష్మణరావు ఉన్నారు.

అటవీ జీవ జాలం, పర్యావరణ పరిరక్షణ
ఛైర్మన్‌గా సభాపతి తమ్మినేని సీతారాం, శాసనసభ నుంచి సభ్యులుగా వై.బాలనాగిరెడ్డి, జ్యోతుల చంటిబాబు, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఎం.బాబు, గంగుల బ్రిజేందర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వై.వెంకట రామారెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, శాసనమండలి నుంచి సభ్యులుగా బి.తిరుమలనాయుడు, పప్పాల చలపతిరావు, మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి.

షెడ్యూల్‌ కులాల సంక్షేమం
ఛైర్మన్‌గా గొల్ల బాబూరావు, శాసనసభ నుంచి సభ్యులుగా కంబాల జోగులు, కొక్కిలగడ్డ రక్షణనిధి, కొండేటి చిట్టిబాబు, వున్నమట్ల ఎలిజా, అలజంగి జోగారావు, టీజేఆర్‌.సుధాకర్‌బాబు, డీబీవీ స్వామి, వి.జోగేశ్వరరావు, శాసనమండలి నుంచి సభ్యులుగా పమిడి శమంతకమణి, గుమ్మిడి సంధ్యారాణి, యండపల్లి శ్రీనివాసులురెడ్డి.

సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ
ఛైర్మన్‌గా పమిడి శమంతకమణి, శాసనసభ నుంచి సభ్యులుగా కదుబండి శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, నంబూరు శంకరరావు, కాటసాని రామిరెడ్డి, కోనేటి ఆదిమూలం, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఏ.శ్రీనివాసులు, మూలె సుధీర్‌బాబు, కరణం బలరామ కృష్ణమూర్తి, శాసనమండలి నుంచి సభ్యులుగా చడిపిరాళ్ల శివనాథరెడ్డి, కంతేటి సత్యనారాయణరాజు.

వెనుకబడిన తరగతుల సంక్షేమం
ఛైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి, శాసనసభ నుంచి సభ్యులుగా బొత్సా అప్పలనరసయ్య, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, బుర్రా మధుసూధన్‌యాదవ్‌, ఎన్‌.వి.గౌడ, రమేష్‌బాబు సింహాద్రి, కె.పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, పీజీవీఆర్‌.నాయుడు, శాసనమండలి నుంచి సభ్యులుగా గౌనివారి శ్రీనివాసులు, దువ్వారపు రామారావు.

గ్రంథాలయ కమిటీ
ఛైర్మన్‌గా అంగర రామమోహన్‌, శాసనసభ నుంచి సభ్యులుగా పుప్పాల శ్రీనివాసరావు, పెండెం దొరబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, తిప్పల నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జరాదొడ్డి సుధాకర్‌, ఎం.రామరాజు, శాసనమండలి నుంచి సభ్యులుగా బచ్చుల అర్జునుడు, బుద్ధా నాగ జగదీశ్వరరావు ఉన్నారు.

షెడ్యూలు తెగల సంక్షేమ కమిటీ
ఛైర్మన్‌గా తెల్లం బాలరాజు, శాసనసభ నుంచి సభ్యులుగా కె.భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ, నాగులపల్లి ధనలక్ష్మి, రెడ్డి శాంతి, తలారి వెంకటరావు, పి.ఉమాశంకర గణేశ్‌, రాపాక వరప్రసాదరావు, బెందాళం అశోక్‌, శాసనమండలి నుంచి సభ్యులుగా గుమ్మిడి సంధ్యారాణి, టి.రత్నాభాయి, శతృచర్ల విజయరామారాజు ఉన్నారు.

మైనారిటీ సంక్షేమ కమిటీ
ఛైర్మన్‌గా మెహమ్మద్‌ ముస్తఫా షేక్‌,  శాసనసభ నుంచి సభ్యులుగా అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌, నవాజ్‌ బాషా, వై.సాయిప్రసాద్‌ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, పి.వి. సిద్దారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, మద్దాళి గిరిధర్‌, శాసనమండలి నుంచి సభ్యులుగా ఎన్‌.ఎండీ ఫరూక్‌, షేక్‌ మొహమ్మద్‌ ఇక్బాల్‌, బీఎన్‌.రాజసింహులు ఉన్నారు.

స్త్రీ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ
ఛైర్మన్‌గా విశ్వసరాయి కళావతి, శాసనసభ నుంచి సభ్యులుగా కంగటి శ్రీదేవి, విడదల రజని, సీదిరి అప్పలరాజు, మొండితోక జగన్‌మోహన్‌రెడ్డి, ఎం.తిప్పేస్వామి, డా.సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.వెంకటసుబ్బయ్య, ఆదిరెడ్డి భవాని, శాసన మండలి నుంచి సభ్యులుగా పోతుల సునీత, బుద్ధా నాగ జగదీశ్వరరావు, గాలి సరస్వతి ఉన్నారు.

శాసనమండలి కమిటీల నియామకం
ఈనాడు డిజిటల్‌, అమరావతి: వివిధ అంశాలపై శాసనమండలి కమిటీలను నియమిస్తూ బుధవారం మండలి ఛైర్మన్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కమిటీ
ఛైర్మన్‌గా శాసనమండలి ఛైర్మన్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌, సభ్యులుగా బుద్ధా వెంకటేశ్వరరావు, కేఎస్‌.లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, పీవీఎన్‌.మాధవ్‌, ఏఎస్‌.రామకృష్ణ ఉన్నారు.

అభ్యర్థనలకు...
ఛైర్మన్‌గా శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, సభ్యులుగా బీద రవిచంద్ర, మంతెన వెంకట సత్యనారాయణరాజు, పాకలపాటి రఘువర్మ, జి.దీపక్‌రెడ్డి.

సభలో ప్రవేశపెట్టే పత్రాలపై
ఛైర్మన్‌గా వైవీబీ రాజేంద్రప్రసాద్‌, సభ్యులుగా ఇళ్ల వెంకటేశ్వరరావు, చిక్కాల రామచంద్రరావు, రాము సూర్యారావు.

నైతిక విలువలపై
ఛైర్మన్‌గా వెన్నపూస గోపాల్‌రెడ్డి, సభ్యులుగా చిక్కాల రామచంద్రరావు, కేఈ ప్రభాకర్‌, విఠపు బాలసుబ్రహ్మణ్యం, సోము వీర్రాజు.

అధికారాలపై...
ఛైర్మన్‌గా దేవసాని చిన గోవిందరెడ్డి, సభ్యులుగా గౌనివారి శ్రీనివాసులు, బచ్చుల అర్జునుడు, చల్లా రామకృష్ణారెడ్డి, పి.అశోక్‌బాబు, ఏఎస్‌.రామకృష్ణ.

ప్రభుత్వ హామీల కమిటీ
ఛైర్మన్‌గా జి.తిప్పేస్వామి, సభ్యులుగా పీవీఎన్‌.మాధవ్‌, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌, కేఈ ప్రభాకర్‌, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.