close
బొడ్డుతాడును వెంటనే కత్తిరించొద్దు

5-15 నిమిషాలు ఆగితే ఎంతో మేలు
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచన

ఈనాడు, దిల్లీ:  తల్లి ప్రసవించిన వెంటనే నవజాత శిశువు బొడ్డుతాడును కత్తిరించొద్దని, కనీసం 5 నుంచి 15 నిమిషాల వ్యవధినివ్వాలని రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వశాఖలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఈ వ్యవధి ఉండడం వల్ల బిడ్డ ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుందని పేర్కొంది.

* బొడ్డుతాడును కాసేపు ఉంచేస్తే, పుట్టిన మొదటి అయిదు నిముషాల్లోనే నవజాతశిశువు అదనంగా మరో 60శాతం ఎర్ర రక్తకణాలను పొందగలుగుతుంది.
* మరింత ప్రాణవాయువు, రక్తం లభించడంతో పాటూ తల్లి కూడా ఎక్కువ రక్తాన్ని కోల్పోవడం జరగదు.
* ఆ శిశువుకు మున్ముందు రక్తహీనత అవకాశాలూ తగ్గుతాయి. రోగనిరోధక వ్యవస్థ మరింత శక్తిమంతంగా తయారవుతుంది.
* అందుకే బొడ్డుతాడు తొలగింపునకు ఈ మాత్రం వ్యవధినివ్వాలి. ఇప్పటికే గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌లోని ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని పాటిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.