
తెదేపా నేతలు దేవినేని ఉమా, ఆనందబాబు ధ్వజం
ఈనాడు, అమరావతి, పటమట (విజయవాడ), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలకు ఫ్రై డే ఫీవర్ పట్టుకుందని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌కు సీబీఐ భయం ఉంది. ఎప్పుడు బెయిల్ రద్దు అవుతుందోనన్న అభద్రతా భావంలో ఉన్నారు. మంత్రి కొడాలి నానితో పాటు కొందరు చోటా నాయకులను అడ్డం పెట్టుకుని తెదేపాను దెబ్బ తీయాలని కుట్ర పన్నుతున్నారు. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ గాలివాటంగా పార్టీలోకి వచ్చారు. అలాగే వెళ్లిపోయారు. ఇటువంటి వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు’’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు దీక్షతో అభద్రతాభావంలోకి..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన ఇసుక దీక్షకు భయపడి సీఎం జగన్మోహన్రెడ్డి అభద్రతా భావంలోకి వెళ్లారని, అందుకే వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలున్నా ఇంకా తెదేపా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో శ్రీరంగ నీతులు చెప్పిన జగన్ ఈ రోజు రాజీనామా చేయకుండానే మా ఎమ్మెల్యేలను తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌ను 90 రోజులు జైల్లో పెట్టి ఏం సాధించారని నిలదీశారు. సిమెంటు కుంభకోణం బయటపడుతుందనే తెదేపాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.
కొడాలి నానిని భర్తరఫ్ చేయాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని, ఆయనతో బీసీలకు క్షమాపణలు చెప్పించాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి తన అనుచరులతో తిట్ల రాజకీయాలకు దిగారని శనివారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ‘‘ఓ మంత్రి రాజధానికి కులం అంటగట్టారు. మరో మంత్రి మీడియాకు కులాన్ని ఆపాదించారు’’ అని మండిపడ్డారు.
వ్యక్తిగత దూషణలు సరికాదు ‘వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని ఇటీవలే తెదేపా అధినేత చంద్రబాబుకు చెప్పుకున్నావు. ఎంపీ కేసినేని నానితో కలిసి నీవద్దకు వచ్చి ధైర్యం చెప్పాం. నీ వెనుక మేమంతా ఉన్నామని అన్నాం. గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేద్దామనీ చెప్పాం.. ఇప్పుడు అవన్నీ మరచి చంద్రబాబు, లోకేశ్‌పైనా విమర్శలు చేస్తున్నావు. నీకు ఇష్టమైన పార్టీలోకి వెళ్లొచ్చు. కాని నిన్నటి వరకూ తెలుగుదేశంలో ఉండి.. ఇప్పుడు వ్యక్తిగత దూషణలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు’ అని తెదేపా ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి అన్నారు. నిన్నటి వరకు తండ్రిగా భావించిన చంద్రబాబును వంశీ ఈ విధంగా దూషించడం సరికాదన్నారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారారు కానీ..వ్యక్తిగత దూషణలు చేయలేదన్నారు. ఉన్నత చదువులు చదివి ఈ విధంగా దిగజారి మాట్లాడవద్దని హితవు పలికారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మొదటి నుంచి మంచి నాయకుడని అన్నారు. తాను, ఎంపీ సుజనా చౌదరి కలిసి వైవీబీకి ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చామని వివరించారు. అయ్యప్పమాలలో ఉండి అలాంటి మాటలా.. |
ముఖ్యాంశాలు
దేవతార్చన

- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
- నాడు స్వప్నిక.. నేడు దిశ!