close

ప్రధానాంశాలు

ఒకే పరీక్షతో ప్రయోజనమే

ఎయిమ్స్‌లో తెలుగు విద్యార్థులకు మరింత అవకాశం
ఈనాడు - అమరావతి

అన్ని వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించడం వల్ల తెలుగు విద్యార్థులు ప్రయోజనం పొందుతారని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఒకే పరీక్ష ఉంటే శిక్షణపరమైన ఒత్తిడి తగ్గడమే కాకుండా ఎయిమ్స్‌, జిప్‌మర్‌ వంటి స్వతంత్ర సంస్థల్లో ఇప్పటికంటే ఎక్కువ సీట్లు సాధించేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌)లో తెలుగు విద్యార్థులు ఉత్తమర్యాంకులు సాధిస్తున్నారు.

సిలబస్‌ ఒకటే కానీ..
ఎయిమ్స్‌, జిప్‌మర్‌, నీట్‌ సిలబస్‌ ఒకటే. ప్రశ్నల సరళి వేరుగా ఉంది.
* ఎయిమ్స్‌ పరీక్ష అత్యంత సంక్లిష్టం. ఇందులో 200 ప్రశ్నలు జీవ, భౌతిక, రసాయనశాస్త్రాలతోపాటు జనరల్‌ నాలెడ్జిలోనూ ఉంటాయి. తప్పు జవాబు రాస్తే 1/3 మార్కును తగ్గిస్తారు.
* నీట్‌లో 180 ప్రశ్నలుంటాయి, తప్పు జవాబుకు 1/4 మార్కు తగ్గిస్తారు.
* జిప్‌మర్‌ పరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. రుణాత్మక మార్కులు లేవు. జీవ, భౌతిక, రసాయనశాస్త్రాలతోపాటు ఇంగ్లీష్‌, లాజిక్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ రీజినింగ్‌లోనూ ప్రశ్నలిస్తారు.

విద్యార్థులకు సమాన అవకాశాలు
ప్రశ్నకు జవాబు ఎలా గుర్తించాలో తెలిసిన విద్యార్థులకు నీట్‌ సులభం. ఎయిమ్స్‌ పరీక్షలో తప్పనిసరిగా విశ్లేషణాత్మక దృక్పథం అవసరమని శిక్షణరంగ నిపుణులు పీవీఆర్కే మూర్తి పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు సమాన అవకాశాలు ఉంటాయన్నారు. ‘‘14 లక్షల మంది వరకు నీట్‌ రాస్తుంటే.. ఎయిమ్స్‌ ప్రవేశపరీక్ష రాసేవారు రెండు లక్షలే. ఎయిమ్స్‌, జిప్‌మర్‌లో సీట్లు రావు.. కష్టమన్న భయంలో విద్యార్థులున్నారు. ఒకే పరీక్షతో విద్యార్థుల ఆందోళన తొలుగుతుంది’’ అని నిపుణులు రాజగోపాల్‌, ప్రసాద్‌ పేర్కొన్నారు.

తగ్గనున్న శిక్షణ
ఇప్పటివరకు దిల్లీ ఎయిమ్స్‌లో తెలుగు విద్యార్థుల ప్రవేశాలు తక్కువ. ఇపుడు నీట్‌ద్వారా జాతీయస్థాయిలో దక్కే ర్యాంకులతో దిల్లీ ఎయిమ్స్‌లో సీట్లు సాధించేందుకు మార్గం ఏర్పడింది. విజయవాడ ఎయిమ్స్‌లో 2018-19 నుంచి ఏటా 18-20 మంది తెలుగు విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. ఒకే పరీక్ష విధానంతో మిగిలిన ఎయిమ్స్‌ల్లోనూ తెలుగు విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎయిమ్స్‌ శిక్షణ పేరుతో నీట్‌ కంటే రెట్టింపు ఫీజు తీసుకుంటున్నారు. ఇప్పుడు శిక్షణ, ఫీజు నీట్‌కే పరిమితమవుతాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.