close

ప్రధానాంశాలు

ఆరింట.. జల సవ్వడి

ప్రాజెక్టులకు అంకురార్పణ దిశగా కసరత్తు
కుందూపైనే రెండు బ్యారేజిలు
26న సీఎంచే శంకుస్థాపనకు ఏర్పాట్లు
ఈనాడు - అమరావతి

కుందూపై రెండు బ్యారేజిల నిర్మాణం, గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుకు అదనపు ఎత్తిపోతల వంటి ఆరు కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు జలవనరులశాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబరు 26న ముఖ్యమంత్రి జగన్‌ వీటికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రాజెక్టుల వివరాలివి.

1
జోలాదిరాశి జలాశయం

కుందూ నదిపై కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలాదిరాశి వద్ద 0.08 టీఎంసీల నిల్వకు అనువుగా నిర్మిస్తారు. కుందూలో వరదల సమయంలో అష్టకష్టాలు పడుతున్న కొన్ని గ్రామాలకు ఈ రిజర్వాయరు నిర్మాణం వల్ల ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు.
అంచనా వ్యయం: రూ.312.30 కోట్లు. 2021-22 లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

2
రాజోలి జలాశయం

కుందూపై కర్నూలు జిల్లా రాజోలి వద్ద ప్రస్తుతం ఉన్న ఆనకట్టకు ఎగువన జలాశయం నిర్మించనున్నారు. 2.95 టీఎంసీలను నిల్వ చేస్తారు. కేసీ కాలువ ఆయకట్టు కొంత స్థిరీకరణ, ప్రొద్దుటూరుకు తాగునీటిని అందించేందుకు ఇది ఉపకరిస్తుంది.
అంచనా వ్యయం: రూ1,357 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయాలనేది లక్ష్యం.

3
కుందూపై ఆనకట్ట... ఆపై నీటి ఎత్తిపోతల

కుందూపై ఆనకట్ట నిర్మించి 5 టీఎంసీలను ఎత్తిపోసేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును కడప జిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద నిర్మిస్తున్నారు. ఉపరితల జలాశయం ద్వారా ఈ నీటిని బ్రహ్మంసాగర్‌కు తరలిస్తారు. కడప జిల్లాలోని బద్వేల్‌, మైదుకూరు నియోజకవర్గాల్లోని బ్రహ్మంసాగర్‌ ఆయకట్టు చివరి భూముల స్థిరీకరణ, తాగునీటి సరఫరాకు ఇది ఉపకరిస్తుంది.
అంచనా వ్యయం: రూ.564.60 కోట్లుQ

4
గండికోట నుంచి చిత్రావతికిఅదనపు నీటి ఎత్తిపోతల

గండికోట జలాశయం నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుకు అదనపు నీటిని మళ్లించేందుకు వీలుగా ఈ పథకాల సామర్థ్యం పెంచనున్నారు. ప్రస్తుతం 2000 క్యూసెక్కుల పంపింగ్‌ సామర్థ్యాన్ని 3000 క్యూసెక్కులకు పెంచనున్నారు. 40రోజులపాటు చిత్రావతి జలాశయానికి నీటిని ఎత్తిపోస్తారు.
అంచనా వ్యయం: రూ.957.40 కోట్లు

5
పులివెందులకు 3 ఎత్తిపోతలు
(మొత్తం అంచనా వ్యయం రూ.1437 కోట్లు)

గాలేరు నగరి ప్రధాన కాలువ నుంచి 1050 క్యూసెక్కులను కలేటి వాగుకు ఎత్తిపోయడం, అక్కడి నుంచి ఎగువ ప్రాంతాలకు, హంద్రీనీవా ప్రధాన కాలువకు తరలించేలా రూపొందిస్తున్నారు. కలేటివాగు నుంచి 350 క్యూసెక్కులు ఎత్తిపోస్తూ చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లి మండలాల్లోని ఎగువ భూములకు ఈ నీరందించాలనేది యోచన. కలేటివాగు నుంచే మరో 700 క్యూసెక్కులు ఎత్తిపోస్తూ హంద్రీనీవా ప్రధాన కాలువకు 473వ కిలోమీటరు వద్ద చేర్చేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు.
అంచనా వ్యయం: రూ.1272 కోట్లు.

6
15 వేల ఎకరాల స్థిరీకరణకు..

కడప జిల్లాలోని వేముల, వేంపల్లి మండలాల్లోని 15వేల ఎకరాలను స్థిరీకరించేందుకు మరో పథకం. గాలేరు నగరి ప్రధాన కాలువ నుంచి 240 క్యూసెక్కులను ఎత్తిపోసేలా నిర్మిస్తారు. అంచనా వ్యయం.రూ.57 కోట్లు. కడప జిల్లాలోని లింగాల, పులివెందుల మండలాల్లోని చెరువులను నింపేందుకు వీలుగా మరో ఎత్తిపోతల నిర్మించనున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ జలాశయం నుంచి ఎర్రబెల్లి చెరువుకు నీటిని ఎత్తిపోయనున్నారు. అంచనా వ్యయం రూ.108 కోట్లు. ఇవి కాక కడప జిల్లాలో మొగమేరు వాగుకు కరకట్టల నిర్మాణానికి వీలుగా మరె రెండు పనులు చేపట్టనున్నారు.

అంచనా వ్యయం: రూ.9.974 కోట్లు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.