close

ప్రధానాంశాలు

దుమ్ములేపిన తెలుగు విద్యార్థులు

జేఈఈ ప్రధాన పరీక్షలో వంద స్కోరు సాధించిన నలుగురు ఆణిముత్యాలు

దిల్లీ: జేఈఈ ప్రధాన పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా వందకు వంద స్కోరును 9 మంది విద్యార్థులు సాధించగా.. వారిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల వారు ఇద్దరేసి చొప్పున ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినలండా జితేంద్ర, తడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్‌; తెలంగాణకు చెందిన రొంగాల అరుణ్‌ సిద్ధార్థ, చాగరి కౌశల్‌ కుమార్‌రెడ్డి ఈ ఘనత సాధించారు. ఈ నలుగురు తెలుగు విద్యార్థులు తమ వారేనని శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.  రాజస్థాన్‌ నుంచి మరో ఇద్దరు, గుజరాత్‌, హరియాణాలకు చెందిన ఒక్కొక్కరుచొప్పున ఈ పర్సంటైల్‌ సాధించారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. శుక్రవారం ఫలితాలు విడుదల చేసింది.  జనవరి 7నుంచి 9 వరకు జరిగిన ఆన్‌లైన్‌ పరీక్షలకు 8,69,010 మంది హాజరయ్యారు. వారిలో ఈడబ్ల్యూఎస్‌ విభాగం కింద 82,123 మంది ఉన్నారు.

మళ్లీ ఏప్రిల్‌ 5 నుంచి పరీక్షలు
చివరి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 5, 7, 9, 11వ తేదీల్లో జరగనున్నాయి. దరఖాస్తు చేసుకోడానికి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు గడువు ఉంటుంది. ఏప్రిల్‌లో జరిగే పరీక్షల ఫలితాల వెల్లడి తర్వాత రెండింటిలో వచ్చిన అధిక పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.