close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో కరోనా విజృంభణ

2,44,5492.5 లక్షలకు చేరువలో మొత్తం కేసులు
24 గంటల్లో 9024 మందికి కొవిడ్‌
87 మంది మృతి

ఈనాడు, అమరావతి: కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసులు 2.50 లక్షలకు చేరువయ్యాయి. మంగళవారం ఉదయంతో గడిచిన 24 గంటల వ్యవధిలో 9,024 మందికి కొత్తగా వైరస్‌ సోకగా మరో 87 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,44,549కి.. మృతుల సంఖ్య 2,203కి చేరింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మంగళవారం నాటి 9,113తో కలిపి మొత్తం 1,54,749కి చేరింది. ప్రస్తుతం 87,597 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతవరకు 25,92,619 శాంపిళ్లు పరీక్షించారు. కర్నూలు జిల్లాలో 1,138 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1,372 మంది 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడ్డారు. అనంతపురం జిల్లా సైతం 25వేల మార్కు దాటింది. మరోవైపు కర్నూలు 30 వేలకు, తూర్పుగోదావరి 35 వేల మొత్తం కేసులకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 4 జిల్లాల్లో ఒక్కోచోట 200 మందికి పైగా మొత్తం మరణాలు నమోదయ్యాయి. మరో రెండు జిల్లాలు ఆ సంఖ్యకు చేరువలో ఉన్నాయి. క్రమేణా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో అనంతపురంలో 13 మంది, చిత్తూరులో 12 మంది, గుంటూరులో తొమ్మిది మంది, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. ¸
తూర్పుగోదావరి, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అయిదుగురు చొప్పున కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాతో చనిపోయారు.
ఆర్టీసీ ఉద్యోగుల్లో 1,698 మందికి కరోనా
ఆర్టీసీ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 1,698 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 22 మంది మృతి చెందగా, 511 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,165 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్‌ సోకిన వారిలో డ్రైవర్‌, కండక్టర్లే అధికంగా ఉంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో కండక్టర్లు 580, డ్రైవర్లు 550 మంది ఉన్నారు. గ్యారేజుల్లో పనిచేసే సిబ్బంది 180 మంది వరకు ఉన్నారు. విధి నిర్వహణలోనే కాకుండా, ఇతర కారణాలతో కూడా ఈ వైరస్‌ బారిన పడినవారు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
* కర్ణాటకలో మంగళవారం 6,257 కరోనా కేసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,88,611కు పెరిగాయి. మంగళవారం మరో 86 మంది కరోనాతో మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 3,398కు పెరిగింది.
* తమిళనాడులో మంగళవారం 118 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,159కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 5,834 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు వైరస్‌ సోకిన బాధితుల సంఖ్య 3,08,649కి పెరిగింది.
* తెలంగాణలో సోమవారం 1896 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 82,647కు, మరణాల సంఖ్య 645కి పెరిగింది. ఈ నెల 10వ తేదీ రాత్రి 8 గంటల వరకూ
నమోదైన కరోనా సమాచారాన్ని మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 338 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.