close
జగన్‌ దేశాన్నే ఇబ్బందుల్లోకి నెడుతున్నారు: బాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ తన ప్రతీకార చర్యలతో దేశాన్నే ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ‘‘జగన్‌ చర్యలతో భారత విదేశాంగ శాఖకు ప్రపంచ దేశాల నుంచి చట్టపరమైన ముప్పు పొంచి ఉంది. ప్రతీకారం కంటే ఇంగిత జ్ఞానం ముఖ్యం. రాష్ట్రాన్ని, దేశాన్ని ఆయన చర్యలు ఎక్కడికి తీసుకెళ్తాయో’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జులైలో క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేసుకోవడంతో పలు దేశాల నుంచి భారత్‌కు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశమున్నట్లు ప్రచురితమైన ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు. ‘‘ఇసుక, మద్యం.. విధానం ఏదైనా దాని వెనుక వైకాపా మాఫియా దోపిడీ, అరాచకాలుంటాయి. దోచుకోవడమే వైకాపా నేతల లక్ష్యం కదా అని సామాన్యుడే ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పే ధైర్యం ఉందా? పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్న ఇసుకను, ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న పన్ను కట్టని మద్యాన్ని అడ్డుకోలేరా? నాటుసారాను ఆపలేరా?’’ అని మరో ట్వీట్‌లో ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.

అరాచక ప్రభుత్వం: దేవినేని
గ్రామీణ నరసరావుపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మరచి అరాచకాలు చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తెదేపా వారిపై అడ్డగోలుగా కేసులు పెడుతోందని.. ఆరు నెలల్లో ఇంత భ్రష్టుపట్టిన ప్రభుత్వం గతంలో ఏదీ లేదని విమర్శించారు. మంత్రులు సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.