close

ప్రధానాంశాలు

జగన్‌కు 6 నెలలకే భయం పట్టుకుంది

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

ప్రత్తిపాడు, కిర్లంపూడి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే పోలీసుల అవసరం పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ సైతం ఊహించనంత మెజారిటీని రాష్ట్ర ప్రజలు కట్టబెడితే.. ప్రస్తుతం పోలీసులతో పాలన సాగిస్తున్నారని, వారిని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని కన్నా ఆరోపించారు. నేనున్నానని.. అధికారంలోకి వచ్చిన వ్యక్తి తెచ్చిన మార్పు కారణంగా నిర్మాణ రంగానికి చెందిన 50 లక్షల మంది కార్మికులు 5 నెలలుగా ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారని అన్నారు. వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలివ్వడానికి మాత్రం నానా ప్రయత్నాలు చేశారన్నారు. ధర్మపాలన రావాలంటే రాష్ట్రంలో భాజపా అధికారం చేపట్టాలన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ.. భాజపా పాలనలోనే సామాజిక న్యాయం ఉందన్నారు. అంతకుముందు కిర్లంపూడి మండలం వీరవరంలో విలేకర్లతో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. భూ కబ్జాలు, గూండాగిరి, దోచుకోవడం వంటి విషయాల్లో వైకాపా ప్రభుత్వం గత పాలకుల కంటే రెండాకులు ఎక్కువే చదివిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వెలికితీసిన మట్టిని రూ.వెయ్యి కోట్లకు అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్న కేంద్రానికే ఆ సొమ్ము చెందాలన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులో భాజపా కార్యకర్త, ఆయన భార్య, తల్లిపై వైకాపా కార్యకర్తలు దాడులుచేసి కొట్టారన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి వారిపైనే అవమానకరంగా ప్రవర్తించారని చెప్పారు. ‘దిశ’ హత్యాచార నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని కన్నా డిమాండ్‌ చేశారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.