Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009371
            [news_title_telugu_html] => 

ఆక్వాపార్కులో కేంద్ర కమిటీ తనిఖీ

[news_title_telugu] => ఆక్వాపార్కులో కేంద్ర కమిటీ తనిఖీ [news_title_english] => [news_short_description] => గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలోని ఆక్వామెగాఫుడ్‌ పార్కును తనిఖీ చేశారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,28, ) )
ఆక్వాపార్కులో కేంద్ర కమిటీ తనిఖీ - EENADU
close
ఆక్వాపార్కులో కేంద్ర కమిటీ తనిఖీ

వినతి పత్రం అందించిన వ్యతిరేక పోరాట కమిటీ

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలోని ఆక్వామెగాఫుడ్‌ పార్కును తనిఖీ చేశారు. నిబంధనల మేరకు నిర్మాణం చేశారా, జొన్నలగరువు, కంసాలబేతపూడిలో ఉన్న మంచి నీటి చెరువును, ఆక్వాపార్కుకు ఆవాసాలు ఎంత దూరంలో ఉన్నాయి, గొంతేరు డ్రెయిన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్వాపార్కు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడు గ్రామాల ప్రజలు కమిటీ సభ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు. పర్యావరణం మొత్తం కాలుష్యమై తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వివరించారు. గొంతేరు డ్రెయిన్‌ పూర్తిగా కలుషితమైపోయిందన్నారు. దానికి కమిటీ సభ్యులు పి.రాజేందర్‌రెడ్డి(విశాఖపట్నం), జి.మహిమ (బెంగళూరు) స్పందిస్తూ కోర్టు ఆదేశాల మేరకు తాము ఇక్కడకు వచ్చామని, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా నివేదిస్తామని చెప్పారు.  వారి వెంట ఆక్వాపార్కు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు ఆరేటి వాసు, ముచ్చర్ల త్రిమూర్తులు, జవ్వాది సత్యనారాయణ తదితరులున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.