Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009374
            [news_title_telugu_html] => 

కాలుష్యానికి యూసీఐఎల్‌

[news_title_telugu] => కాలుష్యానికి యూసీఐఎల్‌ [news_title_english] => [news_short_description] => ప్రస్తుతం ఉన్న సమాచారం, తమ దృష్టికి వచ్చిన అంశాల ప్రకారం.. కడప జిల్లా వేముల మండలం ఎం.తుమ్మలపల్లి పరిసర గ్రామాల్లో.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,28, ) )
కాలుష్యానికి యూసీఐఎల్‌ - EENADU
close
కాలుష్యానికి యూసీఐఎల్‌

కారణమని నిర్దిష్టంగా చెప్పలేం
తాగునీరు, ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర అధ్యయనం
పీసీబీకి నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ

ఈనాడు, అమరావతి: ప్రస్తుతం ఉన్న సమాచారం, తమ దృష్టికి వచ్చిన అంశాల ప్రకారం.. కడప జిల్లా వేముల మండలం ఎం.తుమ్మలపల్లి పరిసర గ్రామాల్లో కాలుష్యానికి, దాని కారణంగా తలెత్తుతున్న దుష్పరిణామాలకు యూసీఐఎల్‌ (యురేనియం శుద్ధి కర్మాగారం) కారణమని నిర్దిష్టంగా చెప్పలేమని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా సంస్థ తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. సొంత నిధులు వినియోగించి ప్రజల ఆరోగ్య పరిస్థితులు, తాగు నీటి నాణ్యతపై జాతీయస్థాయి సంస్థలతో సమగ్ర అధ్యయనం చేయించాలని పేర్కొంది. కర్మాగారంతో పాటు, కాలుష్య బాధిత గ్రామాల్లో రెండురోజులు పాటు పర్యటించి వివిధ వర్గాలతో మాట్లాడిన నిపుణుల కమిటీ బుధవారం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి తన నివేదికను సమర్పించింది.

ఇందులోని ప్రధానాంశాలు..
* ముడి యురేనియం ఎక్కడికక్కడే పడేస్తున్నారు. కర్మాగారంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. బీ సోడియం ఎక్కువగా వస్తోంది. యురేనియం శుద్ధి ద్వారా వస్తోందా? బోర్లను లోతుగా తవ్వడం వల్ల లోపల ఉన్న సోడియం యురేనియంతో పాటుగా బయటకు వస్తుందా? ఫెర్టిలైజర్‌లో నైట్రేట్స్‌ కారణమా? అనే మూడు అంశాలపై అధ్యయనం చేయించాలి. బీ టెయిల్‌పాండ్‌ చుట్టూ ఉండే గట్టు నెర్రెలిచ్చింది. అది కరిగిపోకుండా పటిష్ఠ పరచాలి. హైడెన్సిటీ పాలి ఎథిలీన్‌(హెచ్‌డీపీఈ)తో లైనర్‌ వేసి ఇసుక పోసి నీరు బయటకు పోకుండా చేయాలి. చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. మనుషులు, పశువులు అటు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. బీ పరిమితికి మించి నీటిని వినియోగించిన ఈ ప్రాంతం ఓఈజడ్‌ (ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ జోన్‌)లో ఉంది. అయినా.. ఇప్పటికీ విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని బోర్లు ఉన్నాయి? అయిదేళ్లు, పదేళ్ల కిందట వాటి సంఖ్య ఎలా ఉంది? చదరపు కిలోమీటరుకు ఎన్ని ఉన్నాయో పరిశీలించాలి. బీ గతంలో వేరుశెనగ సాగయ్యే ఇక్కడ... నీటి వినియోగం అధికంగా ఉండే అరటి సాగు పెరిగింది. నీటి కోసం 1,200 అడుగుల వరకు బోర్లు తవ్విస్తున్నారు. పంటల విధానం మార్చాలి. బీ చర్మవ్యాధులు ప్రబలాయి. ఇక్కడి ప్రజల ఆరోగ్యంపై అధ్యయనం చేయాలి. బీ నిబంధనల మేరకు 360 హెక్టార్లలో పచ్చదనం పెంపకం చేపట్టాలి. రెండేళ్లలో పూర్తి చేయాలి.  బీ భూగర్భజలం నాణ్యత పరిశీలించే దిశగా పరీక్షలు చేయించాలి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.