close
ఉగ్గబట్టుకుని నిలవాల్సిందే

బడిలో ఉదయం ప్రార్థన కోసమో.. డ్రిల్‌ చేసేందుకో ఈ విద్యార్థులు వరుసలో నిలుచోలేదు. వీరంతా మూత్ర విసర్జనకు వెళ్లేందుకు ఇలా వరుస కట్టారు. విశ్రాంతి, భోజనం, సాయంత్రపు సమయాల్లో రోజూ ఇదే తంతు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ దుస్థితి నెలకొంది. దుబ్బాకకు కేటాయించిన ఈ పాఠశాలను మిరుదొడ్డిలో తాత్కాలిక భవనంలో నడిపిస్తున్నారు. 5వ తరగతి నుంచి 9 వరకు 350 మంది చదువుకుంటున్నారు. వారికి కేవలం రెండే మూత్రశాలలున్నాయి. ఈ భవనానికి నెలకు రూ.1.57 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు లింగస్వామిని వివరణ కోరగా ఈ విషయం ఉన్నతాధికారులతో పాటు భవన యజమాని దృష్టికి తీసుకెళ్లామని.. మూత్రశాలల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- న్యూస్‌టుడే, మిరుదొడ్డి

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.