IND vs PAK: నేడు దాయాదుల పోరు.. కళ్లప్పగించేద్దాం

ప్రధానాంశాలు

IND vs PAK: నేడు దాయాదుల పోరు.. కళ్లప్పగించేద్దాం

టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్‌ ఢీ

ఎప్పుడూ క్రికెట్‌ మ్యాచ్‌.. క్రికెట్‌ మ్యాచే.. ఈ ఒక్క రోజు తప్ప!

ఒక మ్యాచ్‌ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నంత ఉద్వేగాన్ని కలిగించే రోజిది!

దేశాధినేతలు కూడా పనులన్నీ పక్కన పెట్టి ఆటలో పడిపోయే సమయమిది!

చిన్నా పెద్దా.. ఆడా మగా.. రాజూ పేదా.. ఇలాంటి తేడాలేమీ లేవు.

బంగ్లాలో ఉన్నోళ్లకైనా.. గుడిసెలో బతికేవాళ్లకైనా.. అందరిలో ఈ రోజు ఉండేది ఒకే ఉద్వేగం.. ఒకటే నినాదం.. ‘నా దేశం గెలవాలి.’

మైదానంలో తలపడేది 22 మందే.. కానీ ఆటను కళ్లప్పగించి చూసేవారి సంఖ్య వంద కోట్ల పైమాటే! దేశాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులంతా టీవీలకు అతుక్కుపోయే రోజిది.

దశాబ్ద కాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయి.. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతూ.. తమ పోరు పట్ల ఆసక్తిని ఇంకెన్నో రెట్లు పెంచేసిన చిరకాల ప్రత్యర్థుల కోసం టీ20 ప్రపంచకప్‌లో యుద్ధ భూమి సిద్ధం!

భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ సమరం నేడే.

వన్డేల్లో అయినా, టీ20ల్లో అయినా ప్రపంచకప్‌లో పాక్‌కు ఎన్నడూ తలవంచని ఘనచరిత్రను కొనసాగిస్తూ.. 13వ పర్యాయంలోనూ చిరకాల ప్రత్యర్థి పని పట్టి.. కప్పు వేటను కోహ్లీసేన ఘనంగా ఆరంభిస్తుందా?

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని