IND vs PAK: ఓటమి ఇంత భారమా!

ప్రధానాంశాలు

IND vs PAK: ఓటమి ఇంత భారమా!

దివారం రాత్రి.. సమయం పదిన్నర దాటింది. దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్‌ అభిమానుల్లో నిశ్శబ్దం.. మనసుల్లో తీరని ఆవేదన.. గుండె లోతుల్లో బాధ. ఏ రోజు కోసమైతే ఇన్నాళ్లు ఎదురు చూశారో.. ఏ మ్యాచ్‌ కోసమైతే ఇంత కాలం నిరీక్షించారో.. ఏ ప్రత్యర్థితో తలపడితే సిసలైన క్రికెట్‌ మజా వస్తుందని ఆశించారో.. ఏ జట్టుపై టీమ్‌ఇండియా ఆధిపత్యం కొనసాగించాలని కలలు కన్నారో.. ఇప్పుడు ఆ జట్టు చేతిలోనే ఓటమి ఎదురైతే.. కళ్ల ముందే ఆశలు కూలిపోతుంటే.. చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు తేలిపోతే.. భారత అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని భావించిన జట్టు.. ప్రత్యర్థిని కట్టడి చేయలేక చేతులెత్తేస్తుంటే ఓ వైపు ఆగ్రహం.. మరోవైపు బాధతో గుండె బరువెక్కింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో భారత్‌ పరాజయంపాలైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమిని  ఏమాత్రం ఊహించని అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటివరకూ దాయాదిపై ఓటమి ఎరుగని టీమ్‌ఇండియా.. తొలిసారి ప్రత్యర్థి ముందు తలవంచడంతో దేశంలోని కోట్లాది హృదయాలు అంతులేని నిరాశలో మునిగిపోయాయి.  

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని