రష్యా ఉపగ్రహ సమీపాన కార్టోశాట్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్యా ఉపగ్రహ సమీపాన కార్టోశాట్‌

పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: మన దేశానికి చెందిన రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం కార్టోశాట్‌-2ఎఫ్‌ సమీప భూకక్ష్యలో ఉన్న రష్యా భూపరిశీలన ఉపగ్రహానికి (కానోపస్‌-వీ) ప్రమాదకరంగా అత్యంత సమీపంలోకి వచ్చింది. ఈ పరిణామాలను 2దేశాల అంతరిక్ష సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇస్రో రూపొందించిన 100వ స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్‌-2ఎఫ్‌.  భూకక్ష్యకు సమీపాన కార్టోశాట్‌-2ఎఫ్‌ ఉపగ్రహం రష్యాకు చెందిన భూపరిశీలన ఉపగ్రహానికి ఈ నెల27న అర్ధరాత్రి 1.47కు అత్యంత సమీపంలోకి వచ్చిందని ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోస్మోస్‌ వెల్లడించింది. తియాన్‌మాస్‌ అంచనాల మేరకు ఈ ఉపగ్రహాల మధ్య దూరం కేవలం 224 మీటర్లే. వీటిని భూపరిశీలన కోసమే 2 దేశాలు కక్ష్యలో ప్రవేశపెట్టాయి. అయితే దీనిపై ఆందోళన అవసరం లేదని ఇస్రో వర్గాలు పేర్కొంటున్నాయి. 4రోజులుగా ఇస్రో ఉపగ్రహాన్ని ట్రాక్‌ చేస్తున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. రష్యన్‌ ఉపగ్రహం నుంచి 420 మీటర్ల దూరంలో కార్టోశాట్‌ ఉన్నదని, రెండు ఉపగ్రహాల మధ్య 150 మీటర్ల దూరం ఉన్నపుడు మాత్రమే తదుపరి చర్యలు చేపడతామని ఆ వర్గాలు తెలిపాయి.
పీఎస్‌ఎల్‌వీ-సీ50 ప్రయోగం వాయిదా
షార్‌ నుంచి డిసెంబరు 7న జరపాల్సిన పీఎస్‌ఎల్‌వీ-సీ50 ప్రయోగాన్ని వరుస తుపాన్ల నేపథ్యంలో వాయిదా వేశారు. డిసెంబరు 2న పీఎస్‌ఎల్‌వీ-సీ50ని అనుసంధాన భవనం నుంచి రెండో ప్రయోగ వేదికకు తీసుకువచ్చి, 7న ప్రయోగించాలని శాస్త్రవేత్తలు ముందుగా నిర్ణయించారు. కానీ, 8వ తేదీ వరకు వరుస తుపాన్లు ఉన్నట్లు షార్‌లోని వాతావరణశాఖ పేర్కొంది. దీంతో వాహక నౌకను పంపడం వీలుపడదని భావించి వాయిదా వేశారు. తిరిగి డిసెంబరు 14న ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు