close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ద.కొరియా మార్గం అనుసరణీయం

యుద్ధ ప్రాతిపదికన కేసులను గుర్తించాలి
కరోనా విస్తృతిపై వైద్యులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక
  నిపుణులతో చంద్రబాబు చర్చ

ఈనాడు, అమరావతి: ‘దేశంలోని 24 అత్యవసర కరోనా హాట్‌స్పాట్లలో కృష్ణా జిల్లా ఒకటి. కడపలోనూ శరవేగంగా కరోనా విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసులను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి ప్రాధాన్య క్రమంలో వారిని వేరు చేసి ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స అందించాలి. వెతకడం, గుర్తించడం, పరీక్షించడంలో లోపాలవల్లే ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగి నియంత్రణ కష్టంగా మారింది. 4టీ విధానంతో దక్షిణ కొరియా ఈ మహమ్మారిని నిరోధించగలిగింది. ఈ విధానం మనకూ అనుసరణీయం. వ్యక్తిగత పరీక్షలతో కోవిడ్‌ వైరస్‌ను గుర్తించి పాజిటివ్‌ కేసులను వేరు పరచడం తక్షణావశ్యం’ అని ప్రతిపక్ష నేత, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి వైద్యులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, సాంకేతిక, ఇతర నిపుణులతో కరోనా వైరస్‌ విస్తృతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వాస్తవాలు చెప్పకపోవడం ప్రమాదకరం
ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనాకు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించడం దారుణమని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్‌ తన అవగాహనా రాహిత్యంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందన్నారు. ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలను ఆహ్వానించాల్సిన అవసరముందని, అందరూ మద్దతు తెలపాలని కోరారు.


మానసిక సమస్యలపై కౌన్సెలింగ్‌ అవసరం
- విశాల్‌, పల్మనాలజిస్ట్‌

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు దుర్వినియోగం కాకుండా చూడాలి. మాస్కులను అనవసరంగా వినియోగించకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలి. కరోనాపై భయంతో ప్రజల్లో మానసిక సమస్యలు తలెత్తడమే కాకుండా ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించి అవగాహన కల్పించడం సరైన మార్గం.


ఆయుర్వేదంలో పరిశోధనలు చేయాలి
- రవి, హృద్రోగ నిపుణుడు

కరోనా వైరస్‌లోని ఎస్‌ టైప్‌, ఎల్‌ టైప్‌ల్లో ఏది మన దేశంలో ప్రవేశించిందో ఇంకా స్పష్టత రాలేదు. కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు వందలాది జన్యు మార్పులను సంతరించుకోవడంతో దానికి విరుగుడు వ్యాక్సిన్‌ తయారీ దుర్లభంగా మారింది. ఆయుర్వేద విధానంలో దీనికి సరైన విరుగుడు చూపే పరిశోధనలపై దృష్టి సారించాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.