close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో 97 మందికి వైరస్‌

కువైట్‌ నుంచి వచ్చిన వారిలో 44 మందికి పాజిటివ్‌
రాష్ట్రంలో 2,983కి చేరిన కేసులు
57కి చేరిన మరణాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం మరో 97 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో పలు జిల్లాలకు చెందిన 48, వివిధ దేశాల నుంచి వచ్చిన 49 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 2,983కి చేరింది. ఈ మొత్తం కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 111, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 153 మంది ఉన్నారు. గడచిన 24 గంటల్లో 8,148 మంది నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందడంతో..రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 57కి చేరింది. మంగళవారం నమోదైన కొత్త కేసుల్లో 4 చెన్నై కోయంబేడు కేంద్రంగా చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో నమోదైన 49 కేసుల్లో 44 కువైట్‌ నుంచి వచ్చిన వారివే ఉండగా..అబుదాబి, ఖతార్‌ నుంచి వచ్చిన వారిలో ఐదుగురు ఉన్నారు. మంగళవారం రాష్ట్రానికి చెందిన 55, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 77మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో వివిధ ఆస్పత్రుల నుంచి ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,903 మందికి చేరింది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 759, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 47మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా సోకిన గర్భిణికి శస్త్ర చికిత్స
ఈనాడు డిజిటల్‌, ఏలూరు, ఏలూరు ప్రభుత్వాసుపత్రి, న్యూస్‌టుడే: కరోనా సోకిన నిండు గర్భిణికి ఏలూరు వైద్యులు మంగళవారం సిజేరియన్‌ చేశారు. పుట్టిన శిశువుకు వైరస్‌ పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గర్భిణి అయిన తన భార్యను వైద్య పరీక్షలకోసం కొద్ది రోజుల కిందట భర్త ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నట్లు తేలడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. పది రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అనంతరం ఆమె భర్తకూ పాజిటివ్‌ రావడంతో వారం కిందట ఆశ్రం ఆసుపత్రిలో చేర్చారు. గర్భిణికి నెలలు నిండటంతో వైద్యులు సిజేరియన్‌ చేశారు. మగబిడ్డ జన్మించాడు. ఆశ్రం ఆసుపత్రి కొవిడ్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ... తల్లీబిడ్డా క్షేమమని, శిశువుకు పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చిందన్నారు. బిడ్డను వేరేగా ఉంచి, తల్లి పాలను సేకరించి అందిస్తామన్నారు. తల్లికి నెగిటివ్‌ వచ్చాక ఆమె దగ్గరకు చేరుస్తామన్నారు. శస్త్రచికిత్స చేసిన వైద్యబృందంలో మనోజ్‌కుమార్‌, సాయి, గైనకాలజిస్టులు అంజని, గీతిక, శ్రావ్య ఉన్నట్లు తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.