close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎల్‌జీ పాలిమర్స్‌పై ఎన్జీటీ విచారణ

నివేదికలు పరిశీలించి ఆదేశాలు ఇస్తామన్న ధర్మాసనం
ప్రమాదానికి ఎండీ సహా ఉద్యోగులే కారణం
జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక

ఈనాడు, దిల్లీ, విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ప్లాంటు ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) సోమవారం విచారించింది. ఘటనపై జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి ఆదేశాలు ఇస్తామని ఎన్జీటీ పేర్కొంది. దుర్ఘటనపై సుమోటోగా స్వీకరించిన కేసు, విశ్రాంత ఐఏఎస్‌ ఈఏఎస్‌ శర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ ఎస్‌కే సింగ్‌, సభ్యనిపుణడు నాగిన్‌ నందాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కేంద్ర పర్యావరణ శాఖ, ఎల్‌జీ పాలిమర్స్‌ దాఖలుచేసిన అఫిడవిట్లను పరిశీలించింది. ఎల్‌జీ పాలిమర్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపించారు. విచారణ కమిటీ నివేదికను పరిశీలించి ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది. స్టైరీన్‌ ఆవిరి లీకవడానికి ఎల్‌జీ పాలిమర్స్‌ ఎండీ, పలు విభాగాల ఉద్యోగులు కారణమని జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ తేల్చిచెప్పింది. ప్రమాదంపై అధ్యయనం చేసిన ఎన్జీటీ కమిటీ సభ్యులు నిబంధనల ఉల్లంఘనలను నిర్ధారించారు. వాటిని నిరూపించే పలు పత్రాలను పొందుపరిచారు.

పర్యావరణ శాఖ అఫిడవిట్‌
ప్లాంటులో ప్రమాదంపై తక్షణమే కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల నివేదిక కోరామని పర్యావరణ శాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. నిబంధనల ప్రకారం వ్యవహరించామని, కేంద్ర సంక్షోభబృందం సమావేశమై పరిస్థితి సమీక్షించిందని తెలిపింది.

నిర్లక్ష్యమే కారణం.. నిగ్గుతేల్చిన నివేదిక
* ట్యాంకులో ఉష్ణోగ్రతలను నియంత్రించి, పాలిమరైజేషన్‌ జరగకుండా చూడడానికి అవసరమైన టీబీసీ రసాయనం నిల్వలు సంస్థ దగ్గర లేవు. డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌ శాతం ఎంతన్న విషయాన్ని పర్యవేక్షించే వ్యవస్థ లేదు. ట్యాంకు పైభాగంలో ఉష్ణోగ్రతలను పరిశీలించలేదు. శీతలీకరణ ప్రక్రియను 24 గంటలు నిర్వహించకపోవడం, తీవ్రమైన మానవ తప్పిదాలు, కర్మాగార బాధ్యుడు, ట్యాంకు నిర్వహణ ఉద్యోగుల నిర్లక్ష్యం ప్రమాదానికి ప్రధాన కారణాలు.
* ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ కార్యకలాపాలు సాగించడానికి కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసినా మంజూరుకాలేదు. రాష్ట్ర పీసీబీ అధికారుల నుంచి అనుమతులు పొంది కార్యకలాపాలను కొనసాగించారు. ఏపీ పీసీబీ అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత గానీ పర్యావరణ అనుమతులపై దృష్టిపెట్టలేదు.
* మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లోని నీరు యథాతథ]ంగా తాగడానికి పనికిరాదు. ‘యాక్టివేటెడ్‌ కార్బన్‌  అబ్‌జార్షన్‌’, ‘ఓజోనీకరణ’ తర్వాతే ఆ నీటిని  వినియోగించాలి.
* పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే ఆర్థికనష్టం సంభవించకుండా ఆ సంస్థ రూ.15 కోట్లకు బీమా చేయించింది. ఒక ప్రమాదానికి అత్యధికంగా రూ.5 కోట్ల బీమా మాత్రమే వస్తుంది.
* ప్రమాదం జరిగిన ఏడోరోజూ భారీగా స్టైరీన్‌ ఆవిరి వచ్చింది. మే 13న ట్యాంకు సమీపంలో 1058.8 మైక్రోగ్రామ్స్‌/మీటర్‌ క్యూబ్‌ స్టైరీన్‌ ఉంది. ఇలా భారీగా ఉంటే మనుషులు, ఇతర జీవరాశుల ఆరోగ్యం దెబ్బతింటుంది.
* పీసీబీ కార్యదర్శి వివేక్‌యాదవ్‌ ఎల్‌జీ పాలిమర్స్‌కు ‘కన్సెంట్‌ ఆర్డర్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌’ (సి.ఒ.ఇ.) జారీచేశారు. ఆ ఉత్తర్వుల్లో పలు నిబంధనలను సూచించినా, కంపెనీ పాటించలేదని తెలుస్తోంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.