close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇళ్ల పట్టాల్లో.. రైలు పట్టాలంత అవినీతి

పశ్చిమలోనే రూ.690 కోట్ల స్వాహా
కళా వెంకటరావు ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ఆరోపించారు. ఓ వైపు ఇళ్ల స్థలాల కోసం స్థానిక వైకాపా నేతలు తమ భూములను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, మరోవైపు ఇళ్ల స్థలాలు కావాలంటే కమీషన్‌ ఇవ్వాల్సిందేనంటూ కోట్ల రూపాయలు పేదల నుంచి దండుకుంటున్నారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల నుంచి రూ.1,400 కోట్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి మరో రూ.200 కోట్లు వసూలు చేశారు. ఈ పథకం ప్రక్రియ ప్రారంభం కంటే రెండు నెలల ముందు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ లావాదేవీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎకరం రూ.5 లక్షల విలువ చేయని భూమిని రూ.45 లక్షల నుంచి రూ.75 లక్షలకు కొంటున్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.690 కోట్ల అవినీతి జరిగింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రూ.183 కోట్లు కొల్లగొట్టారు. ఇక్కడ ఎకరం రూ.40 లక్షలుంటే.. రూ.75 లక్షలకు కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే తంతు జరుగుతోంది. ఇళ్ల పట్టాల్లో రైలు పట్టాలంత అవినీతి జరిగింది’’ అని ధ్వజమెత్తారు.

కమీషన్‌ ఇస్తేనే స్థలాలు..
‘‘స్థానిక వైకాపా నేతలు కమీషన్లు తీసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో.. రూ.10వేలు ఇచ్చిన వారికి శ్మశానాల్లో, రూ.30 వేలు ఇచ్చిన వారికి చెరువుల్లో.. రూ.60వేలు ఇచ్చిన వారికి ఊరికి దగ్గర్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలం రేలంగిలో ఒక్కో ఇంటి పట్టా కోసం.. రూ.40వేల చొప్పున డిమాండు చేస్తున్నారంటూ.. ఇద్దరు లబ్ధిదారులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అక్కడ 600 వరకు ఫిర్యాదులొచ్చాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. పలుచోట్ల ఇళ్ల స్థలాల పేరుతో పేద, బడుగు, బలహీనవర్గాల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. గుడివాడలోనూ అరాచకాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాల కుంభకోణంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని కళా వెంకటరావు డిమాండ్‌ చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.