close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆదుకోవాల్సింది పోయి దోపిడీయా?

పెట్రో ధరల పెంపుపై సోనియా గాంధీ విమర్శలు
దేశవ్యాప్తంగా నిరసనలు

దిల్లీ: పెట్రో ధరల పెంపు పేరుతో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు సంక్షోభంలో చిక్కుకుంటే వారికి సహాయం అందించాల్సింది పోయి, పన్నుల భారం పెంచడమేమిటని ప్రశ్నించారు. ‘ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా గళమెత్తండి’ పేరుతో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. దీన్ని పురస్కరించుకొని ఆమె వీడియో ద్వారా మాట్లాడారు. పెట్రోలు, డీజిల్‌లపై పెంచిన ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని డిమాండు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయని, ఇక్కడ మాత్రం మోదీ ప్రభుత్వం మూడు నెలల్లో 22సార్లు ధరలు పెంచిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా వీడియోను ప్రదర్శిస్తూ లాక్‌డౌన్‌ కాలంలో ధరలు పెంచుతూ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్లు ఆర్జించిందని చెప్పారు. రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేస్తూ పెట్రో ధరల పెంపుపై అందరూ గళం విప్పాలని కోరారు. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు పలుచోట్ల నిరసన  ప్రదర్శనలు జరిపారు. ఆ విభాగం అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎడ్లబండిని నడపగా పోలీసులు అడ్డుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ లాభాన్ని ప్రజలకు బదలాయించిందని, భాజపా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఆ సొమ్ము ప్రజల కోసమే.. ఆర్‌జీఎఫ్‌ కోసం కాదు...: భాజపా
సోనియా గాంధీ చేసిన విమర్శలను భాజపా తిప్పికొట్టింది. పెట్రో ధరల పెంపు ద్వారా వసూలయిన సొమ్మును ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. అంతేతప్ప ఆ నిధులను అల్లుడు కోసమో, రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ (ఆర్‌జీఎఫ్‌)కో మళ్లించడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కూడా చమురుపై వ్యాట్‌ను విధిస్తున్నాయని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.