close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ కేంద్రాల్లో లోటు రానీయొద్దు

రోగులకు సంతృప్తికర సేవలందించాలి
అధికారులకు సీఎం జగన్‌ స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ కేంద్రాల్లోని రోగులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారికి సేవల్లో ఎలాంటి లోటు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాజీకి తావులేకుండా.. అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఔషధాలను అందించాలని నిర్దేశించారు. కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. కరోనా మైల్డ్‌ పాజిటివ్‌ కేసుల రోగులకు సేవలందించేందుకు 4 వేల వరకు పడకలు సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.
* ఆసుపత్రులలో పడకలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలి. రోజంతా వైద్య సేవలందించాలి.
* పాజిటివ్‌ కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో.. ఏఎన్‌ఎంలు, ఆశాలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరాతీయాలి.
* ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలి. ఆ సమాచారాన్ని వైద్యాధికారులకు తెలియజేసి పరీక్షలు చేయాలి.
* హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారి ఇళ్లకూ వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. పరీక్షలు చేసి మందులివ్వాలి.
* కొవిడ్‌పై ప్రజల్లో భయాందోళనలు తొలగిపోయేలా అవగాహన కల్పించాలి.
* అనుమానం వస్తే టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించాలి.
* వైద్య పరీక్షలు, ఇళ్లలోనే ఉంటూ చికిత్స తీసుకోవడంపైనా తెలియజెప్పాలి.
* గ్రామ సచివాలయాల్లోని హోర్డింగుల్లో సేవల వారీ ఫోన్‌నంబర్లు రాయాలి అని సీఎం ఆదేశించారు.

‘నాడు-నేడు’కు రుణ సేకరణ
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన మనబడి ‘నాడు-నేడు’ రెండు, మూడు దశల పనులకు రుణాల సేకరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘నాడు- నేడు’ పనులపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ.. దాతలు చేపట్టిన పనుల్లో జాప్యం జరిగితే వారిని తప్పించి, వాటి బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించారు. ఈ పనుల బాధ్యతను గ్రామ సచివాలయ ఇంజినీర్లకు అప్పగించాలని, వారు ప్రతి రోజూ తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. ఆ ఇంజినీర్లకే పనులు విలువ నమోదు అధికారం ఇవ్వాలని, వారు వారానికోసారి పనులపై నివేదికలు సమర్పించాలని సూచించారు.

రంగులు ఆహ్లాదంగా ఉండాలి
పాఠశాల భవనాలకు వేసే రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని, అక్కడ పండగ వాతావరణం కనిపించాలని సీఎం సూచించారు. పిల్లలకు అన్ని విషయాలపై అవగాహన కలిగేలా గోడలపై బొమ్మలు వేయాలని వెల్లడించారు. వర్షాకాలం ముగిసిన తర్వాత పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేదంటే ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు పలు రంగుల నమూనాలను సీఎంకు వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.