close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో 20వేలు దాటేశాయ్‌

5 జిల్లాల్లోనే సగం కేసులు
కేవలం 12 రోజుల్లో 10 వేల మందికి పాజిటివ్‌
మరో ఏడుగురి మృతి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసులు 20,019కి చేరాయి. తొలి 10వేల కేసులు నమోదు కావడానికి దాదాపు 95 రోజుల సమయం పడితే మరో పది వేల కేసులు కేవలం 12 రోజుల్లోనే వెలుగుచూడటం గమనార్హం. కరోనా ప్రారంభమైన తొలి రోజుల్లో 100 కేసులు నమోదు కావడానికి 12 రోజులు సమయం పడితే.. ప్రస్తుతం అన్‌లాక్‌ కాలంలో కేవలం పన్నెండు రోజుల్లోనే 10వేల కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు, గుంటూరు, అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి   జిల్లాల్లోనే 10,515 కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 2,587 కేసులు ఉండగా అనంతపురం, గుంటూరు జిల్లాల్లో రెండేసి వేలు దాటిపోయాయి. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు 2000 అంకెకు దగ్గరగా ఉన్నాయి.

కొత్తగా 1322...
రాష్ట్రంలో కొత్తగా 1322 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని సోమవారం అధికారులు వెల్లడించారు. మొత్తం 16,712 మందిని పరీక్షించగా రాష్ట్రానికి చెందిన 1263 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మంది, విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురు మహమ్మారి బారిన పడినట్లు గుర్తించారు. కొవిడ్‌తో సోమవారం మరో ఏడుగురు మరణించారు. శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 239కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,33,852 మందికి కరోనా పరీక్షలు చేశారు.

తూర్పుగోదావరిలో చికిత్స పొందుతున్నవారు ఎక్కువ...
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,920 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10,860 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,299మంది కర్నూలు(1,239), గుంటూరు (1,229), కృష్ణా జిల్లాలో (1056) మంది చికిత్స పొందుతున్నారు.

59 మంది తితిదే ఉద్యోగులకు పాజిటివ్‌
ఈనాడు, తిరుపతి: తాజాగా తిరుపతి పరిధిలో 71 మందికి కరోనా సోకగా వీరిలో 59 మంది తితిదే సిబ్బంది ఉన్నారని సోమవారం వైద్యాధికారులు నిర్ధరించారు. వారిలో 30 మంది భద్రతా విభాగానికి చెందిన వారు. ఉద్యోగుల భద్రతపై ఈవో అనిల్‌కుమార్‌ సోమవారం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సిబ్బందికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌లో అధికారులతో మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతపై చŸర్యలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణలో 25 వేలు దాటాయ్‌
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో సోమవారం కొత్తగా 1831 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కొవిడ్‌ బాధితుల సంఖ్య 25,733కు పెరిగింది. మహమ్మారి బారినపడి సోమవారం మరో 11 మంది మృత్యువాత పడగా, మొత్తంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 306కు పెరిగింది.

తమిళనాడు, కర్ణాటకలలో..
* తమిళనాడులో కొన్ని రోజులుగా నిత్యం నాలుగు వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా... సోమవారం 3,827 వచ్చాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,14,978కు చేరింది. వైరస్‌ కారణంగా మరో 61 చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,571కు పెరిగింది.
* కర్ణాటకలో కొత్తగా 1,843 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 25,317కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కన్నుమూయగా మృతుల సంఖ్య 401కు చేరింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.