close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆకాశంలో కనువిందు చేయనున్న తోకచుక్క

నేటి నుంచి 20 రోజుల పాటు
ప్రకాశవంతంగా ‘నియోవైజ్‌’ దర్శనం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నాసా శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న ఓ తోకచుక్క అందరికి కనువిందు చేయనుందని బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్‌ డా.బి.జి.సిద్ధార్థ తెలిపారు. ఈ నెల 13 నుంచి దీన్ని స్పష్టంగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్చి 27న ఈ తోకచుక్కను కనుగొనగా దీనికి సీ 2020 ఎఫ్‌3 నియోవైజ్‌గా నామకరణం చేశారు. అప్పటికే ఇది పాలపుంత చుట్టూ పరిభ్రమణం చేయడం ఆరంభించింది. ఈ నెల 3న సూర్యునికి అత్యంత సమీపానికి వెళ్లి 43 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో చక్కర్లు కొట్టింది. ఈ నెల 13 నుంచి సుమారు 20 రోజులపాటు ఈ తోకచుక్క భూమిచుట్టూ పరిభ్రమిస్తుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, శాస్త్రవేత్త రఘునందన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 7.40 గంటల సమయంలో 20 నిమిషాలపాటు ప్రకాశవంతంగా ఉన్న తోకచుక్కను చూడవచ్చని తెలిపారు. ఈ నెల 22, 23లలో ‘నియోవైజ్‌’ భూమికి మరింత దగ్గరగా వస్తుందని, ఆ సమయంలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇది సుమారు ఐదు కిలోమీటర్ల పొడవు ఉండటం, భూమికి అత్యంత సమీపంగా రావడం వల్ల దీన్ని ఎటువంటి పరికరాలూ లేకుండా చూడవచ్చని వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.