close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉద్ధృతి తగ్గని విలయం

దేశంలో 9 లక్షలు దాటిన కేసులు
4 రోజుల్లో 1.12 లక్షల మందికి కరోనా
రోజువారీ మరణాల్లో రెండో స్థానానికి కర్ణాటక

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. కొవిడ్‌-19 కేసులు మంగళవారం 9 లక్షల మార్కును దాటాయి. వరుసగా మూడోరోజు 28వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం రోజువారీ మరణాల్లో ఆ రాష్ట్రం తమిళనాడును వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరింది. దేశంలో వరుసగా అయిదోరోజు 500మందికిపైగా మరణించారు.  మరోవైపు, దిల్లీలో రోజురోజుకీ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అక్కడ మంగళవారం కేవలం 1,246 మంది పాజిటివ్‌గా తేలారు. పక్షం రోజుల క్రితం 6% కనిపించిన దిల్లీ కేసుల వృద్ధిరేటు ఇప్పుడు 1.7%కి తగ్గింది. ఇక్కడ ప్రతిరోజూ 20వేల నుంచి 25వేల వరకు పరీక్షలు నిర్వహించి రోగులను వేరుచేయడం వల్లే సంక్రమణ వేగం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. రెండు వారాల క్రితం దిల్లీ ఆక్రమించిన స్థానంలోకి ఇప్పుడు కర్ణాటక వచ్చింది.   దేశంలో కేసులు 4 రోజుల్లో 8 లక్షల నుంచి 9 లక్షలు దాటాయి. గత నాలుగు రోజుల్లో 1,12,950 కొత్త కేసులు వచ్చాయి. తాజా లెక్కల ప్రకారం రికవరీ రేటు 63.92%, మరణాల రేటు 2.61%, పాజిటివిటీ రేటు 7.49%కి చేరింది. 24 గంటల వ్యవధిలో గతంలో ఎన్నడూలేనంతగా 2.86 లక్షల పరీక్షలు నిర్వహించారు.
* బిహార్‌లో కొవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 16 నుంచి 31 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ ప్రకటించారు.

స్వీయ క్వారంటైన్‌లోకి జితేంద్రసింగ్‌
కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌, భాజపా ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ స్వీయ క్వారంటైన్‌లోకి వెళ్లారు. జమ్మూ-కశ్మీర్‌ భాజపా అధ్యక్షుడు రవీందర్‌ రైనాకు కొవిడ్‌ సోకినట్లు తేలడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల చేతిలో మరణించిన పార్టీ నేత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వారిద్దరు ఈ నెల 12న శ్రీనగర్‌ నుంచి బాందీపోరా వెళ్లారు. ఈ సందర్భంగా వీరితోపాటు రవీందర్‌ ప్రయాణించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.