close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రమాదకర పరిశ్రమల పరిశీలనకు కమిటీలు

జిల్లా కలెక్టర్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు
రాష్ట్రంలో 90 రోజుల ప్రత్యేక డ్రైవ్‌

ఈనాడు, అమరావతి: పరిశ్రమల భద్రత, పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న నిబంధనల పరిశీలనకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 90 రోజుల్లో రాష్ట్రంలోని కర్మాగారాలన్నీ తనిఖీ చేసి, నివేదికలు సమర్పించాలని కమిటీలకు లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ నాలుగు కీలకం: బీ ప్రమాదకారక పరిశ్రమలుబీ ప్రమాదకారక ఖనిజాలు, రసాయనాలు నిల్వ చేసి, తయారు చేసేవి బీ రక్షణ రంగానికి అవసరమైన పేలుడు పదార్థాల నిల్వ, తయారీ కర్మాగారాలు బీ రెడ్‌ కేటగిరిలోని(ప్రమాదాలకు ఆస్కారం ఉండేవి) అన్నీ..
కమిటీ సభ్యులు వీరే..: కమిటీలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఛైర్మన్‌గా.. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి, డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, జిల్లా అగ్నిమాపక శాఖ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గుర్తించిన లోపాలను సరిచేసి, దానికి సంబంధించిన నివేదికను నిర్దేశిత నమూనాలో 30 రోజుల్లోపు పరిశ్రమల నిర్వాహకులు అందించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.