close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాజిటివ్‌ శాతం పైపైకి

55,692 పరీక్షల్లో 17.94% మందికి వైరస్‌
రాష్ట్రంలో మరో 9,996 కరోనా కేసులు
24 గంటల్లో 82 మంది మృతి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల శాతం రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 వరకు 55,692 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా 17.94 శాతం మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పరీక్షల్లో పాజిటివ్‌ కేసుల శాతం ఇంత ఎక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో మరో 9,996 కొత్త కేసులు వచ్చాయి. వైరస్‌ కారణంగా మరో 82 మంది మరణించారు. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో పది మంది చొప్పున, అనంతపురం జిల్లాలో 8 మంది, కడప జిల్లాలో ఏడుగురు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,378కి, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,64,142కి చేరాయి.
* 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 కేసులు, చిత్తూరు జిల్లాలో 963, విశాఖ జిల్లాలో 931 కేసులు నమోదయ్యాయి. మొత్తం 37,146 కేసులతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
* రాష్ట్రంలో మరో 9,499 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి దాకా వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,70,924కి చేరింది. 90,840 మంది చికిత్స పొందుతున్నారు.
* రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం... దేశంలో 24 గంటల వ్యవధిలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మహారాష్ట్రలో 12,712 కేసులు వచ్చాయి.
* గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 27,05,459 నమూనాల్ని పరీక్షించగా 9.76% పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.