సరిహద్దులకు రండి

ప్రధానాంశాలు

సరిహద్దులకు రండి

అక్కణ్నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్తాం
తెలంగాణ ఆర్టీసీతో 27న ఒప్పందం
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడి

విజయవాడ బస్టేషన్‌, జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికులు ఆంధ్రా సరిహద్దుల వరకు చేరుకుంటే.. వారిని ఏపీలో గమ్యస్థానాలకు చేరుస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సర్వీసులపై మంగళవారం తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకుంటామని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పేందుకు చాలా ప్రయత్నం చేశామన్నారు. టీఎస్‌ఆర్టీసీకి మూడు రోజులు సెలవులు రావడం వల్ల ఒప్పందం 27వ తేదీన చేసుకుంటామని పేర్కొన్నారు. అప్పటి వరకు తెలంగాణతో ఉన్న ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విరివిగా బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇప్పటికే బస్సులను పునరుద్ధరించామని వివరించారు. మరోవైపు శనివారం నుంచి 100 ఆర్టీసీ బస్సులను ఏపీ సరిహద్దుల్లో సిద్ధంగా ఉంచినట్లు విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు తెలిపారు. సరిహద్దు ప్రాంతాలైన గరికపాడు, వాడపల్లి, తిరువూరు వరకు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. శనివారం విజయవాడ నుంచి గరికపాడు వరకు 250 మందిని, గరికపాడు నుంచి విజయవాడ వరకు 150 మందిని 15 బస్సుల్లో చేరవేశామని జగ్గయ్యపేట డిపో మేనేజర్‌ సుబ్బన్నరెడ్డి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని