
ప్రధానాంశాలు
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడి
దిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా(స్ట్రెయిన్) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 116కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం పేర్కొంది. బాధితులను వేరుగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇటీవల వీరిని కలిసిన వారందరినీ క్వారంటైన్లో ఉంచడంతో పాటు సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
దేశంలో కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,01,79,715కి పెరిగింది. తాజాగా 16,977 మంది కోలుకుని ఇంటికి వెళ్లడంతో రికవరీ రేటు 96.56శాతానికి చేరింది. మొత్తం క్రియాశీల కేసులు 2,11,033కి చేరడంతో ఆ రేటు 2 శాతానికి పడిపోయింది. మరోవైపు గత 24 గంటల్లో 15,158 మంది కొవిడ్ బారిన పడగా. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 5 లక్షల 42వేల 841కి చేరింది. మరో 175 మంది మృత్యువాతపడటంతో మృతుల సంఖ్య 1.52 లక్షలు దాటింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్!
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- ఆమె నవ్వితే లోకమంతా ఆనందం
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదు: కేంద్రం
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!