
ప్రధానాంశాలు
వివరాలు తెలిస్తే 9392903400కు చెప్పండి
నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని దేవాలయంలో స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని సిట్ చీఫ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆలయాన్ని సిట్ బృంద సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. ధ్వంసమైన విగ్రహం, ఆలయ పరిసరాలు, ఖండిత విగ్రహ శిరస్సు లభించిన రామకోనేరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మరిన్ని వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో సీఐడీ, పోలీసు అధికారులు, క్రైమ్ పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. కేసు దర్యాప్తును సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల దేవాలయాల్లో ఒకే తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో వీటన్నింటికి ఏదైనా ఒకే కారణం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక పోలీసుల సహకారంతో కేసును ఛేదించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ ఘటన గురించి ఎలాంటి సమాచారం లభించినా ఫోను నంబరు 93929 03400కు వివరాలు అందించాలని ఆయన కోరారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్!
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- ఆమె నవ్వితే లోకమంతా ఆనందం
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదు: కేంద్రం
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!