close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రతిష్టంభన!

4 దశల ఎన్నికలకూ ఒకేసారి నోటిఫికేషన్‌ ఇచ్చిన ఎస్‌ఈసీ
ఎన్నికలు సాధ్యం కాదంటున్న ప్రభుత్వం.. ఉన్నతాధికారులు
ఎస్‌ఈసీ వీడియో సమావేశానికి అధికారుల గైర్హాజరు
టీకా వేయనిదే విధుల్లో పాల్గొనేది లేదన్న ఉద్యోగ సంఘాలు
సుప్రీంకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
ఈనాడు - అమరావతి

పంచాయతీ ఎన్నికలపై ప్రతిష్టంభన తొలగలేదు... ఉత్కంఠకు తెరపడలేదు... ఎన్నికల సంఘం వెనకడుగు వేయలేదు... ప్రభుత్వం పట్టు వీడలేదు..! ముందు చెప్పినట్టుగానే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నాలుగు దశలకూ ఒకేసారి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాన్ని ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరి¸ పునరుద్ఘాటించింది. ఎస్‌ఈసీ తలపెట్టిన వీడియో సమావేశానికి అధికారులంతా ముఖం చాటేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్‌ఈసీపై విమర్శల జోరు మరింత పెంచారు. టీకా వేయకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఎస్‌ఈసీ.. ఎన్నికలను అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగసంఘాల వైఖరినీ తప్పుబట్టారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం మాత్రం తన వైఖరిని వీడలేదు. ఎస్‌ఈసీ వీడియో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా అధికారులెవరూ వెళ్లలేదు సరికదా, జిల్లా కలెక్టర్లనూ వెళ్లనివ్వలేదు. తాజా పరిణామాలపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానున్న తరుణంలో.. అందరి చూపూ సుప్రీంకోర్టు వైపే ఉంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సోమవారం విచారించనున్న సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


4 దశలకూ ఒకే నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ
ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో  పంచాయతీ ఎన్నికలు
తొలి దశలో 146 మండలాల్లో..
25 నుంచి నామినేషన్లు.. పోలింగ్‌ సమయం పెంపు

ఈనాడు, అమరావతి: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు. 4 దశల ఎన్నికలకూ కలిపి ఒకే నోటిఫికేషన్‌ ఇచ్చారు. ప్రతి దశకూ విడివిడిగా నోటిఫికేషన్‌ ఇస్తామని గతంలో ఎన్నికల సంఘం తెలిపింది. దానికి భిన్నంగా.. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో జరిగే ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్‌ జారీ చేశారు. తొలి విడతలో 11 జిల్లాల్లోని 14 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న 146 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగడం లేదు. తమ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలే ఉన్నాయని, ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా 3, 4 దశల్లో నిర్వహించాలని విజయనగరం కలెక్టరు కోరినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఏర్పాట్లకు కొంత సమయం కావాలని, తమ జిల్లాను తొలి విడతలో చేర్చవద్దని ప్రకాశం జిల్లా కలెక్టరు కోరినట్లు వెల్లడించాయి. ప్రకాశం జిల్లాలో 2, 3, 4 దశల్లోనూ, విజయనగరం జిల్లాల్లో 3, 4 దశల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలన్న ఎస్‌ఈసీ ఆదేశాల్ని ప్రభుత్వం అమలు చేయనందున.. ఆ 2 జిల్లాల్లో తొలి దశలో ఎన్నికలు ఉండవని అధికార వర్గాల్లో శుక్రవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఆ 2 జిల్లాల్లోని పంచాయతీలకు తొలి విడతలోనే ఎన్నికలు జరపాలని చివరి క్షణంలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఒక మండలం మినహా.. రాష్ట్రంలో 659 మండలాలున్నాయి. వాటిలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం గ్రామీణ మండలం మినహా మిగతా అన్ని మండలాల్లోని పంచాయతీలకూ 4 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. రాజమహేంద్రవరం గ్రామీణ మండలాన్ని నగరపాలక సంస్థలో విలీనం చేసే ప్రతిపాదన ఉన్నందున ఎన్నికలు నిర్వహించట్లేదని అధికారులు తెలిపారు.

ఉదయం 6.30 నుంచే పోలింగ్‌

పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ గతంలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంట వరకే జరిగేది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ సమయాన్ని పొడిగించామని, ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందన్నారు. తొలి విడతలో ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేదీ ఈ నెల 25న జిల్లాల రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. 25 నుంచి 27 వరకు 3 రోజులపాటు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను తీసుకుంటారు. సర్పంచి, వార్డు సభ్యులకు పార్టీ గుర్తులకు అతీతంగా.. ప్రత్యక్ష విధానంలో ఎన్నికలను నిర్వహిస్తారు. ఎన్నికైన వార్డు సభ్యులంతా కలిసి ఉప సర్పంచిని ఎన్నుకుంటారు.

దశల వారీగా పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు ఇవే!

శ్రీకాకుళం

తొలి విడత (05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

మండలాలు: శ్రీకాకుళం ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

మండలాలు: ఎల్‌.ఎన్‌.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి

మండలాలు: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, రాజాం, సంతకవిటి, వంగర


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి

మండలాలు: ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, భామిని, పాలకొండ, వీరఘట్టాం, సీతంపేట, రేగిడి ఆమదాలవలస 

విజయనగరం

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: పార్వతీపురం

మండలాలు: బాడంగి, బలిజిపేట, బొబ్బిలి, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రపురం, సాలూరు, సీతానగరం, తెర్లాం


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: విజయనగరం

మండలాలు: భోగాపురం, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, డెంకాడ, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్‌.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, శృంగవరపుకోట, వేపాడ, విజయనగరం

విశాఖపట్నం

తొలి విడత (05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: విశాఖపట్నం

మండలాలు: భీముని పట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: అనకాపల్లి

మండలాలు: అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నర్సీపట్నం

మండలాలు: నర్సీపట్నం, నాతవరం, రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం, గొలుగొండ, కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: పాడేరు

మండలాలు: అనంతగిరి, అరకు వ్యాలీ, చింతపల్లి, డుంబ్రిగూడ, జి.మాడుగుల, జి.కె.వీధి, హుకుంపేట, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, పెదబయలు

తూర్పుగోదావరి

తొలి విడత (05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: అమలాపురం

మండలాలు: అయినవల్లి, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కాట్రేనికోన, కొత్తపేట, మలికిపురం, ముమ్ముడివరం, మామిడికుదురు, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కాకినాడ, పెద్దాపురం

మండలాలు: గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి

గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండంగి, తుని, ఏలేశ్వరం


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: రాజమహేంద్రవరం

మండలాలు: ఆలమూరు, గోకవరం, కడియం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం

రెవెన్యూ డివిజన్‌: రామచంద్రాపురం

మండలాలు: కాజులూరు, అనపర్తి, బిక్కవోలు, కె.గంగవరం, కపిలేశ్వరపురం, మండపేట, రామచంద్రాపురం, రాయవరం


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: రంపచోడవరం

మండలాలు: అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి, వై.రామవరం

రెవెన్యూ డివిజన్‌: ఏటపాక

మండలాలు: చింతూరు, కూనవరం, వి.ఆర్‌పురం, ఏటపాక

పశ్చిమగోదావరి

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఏలూరు

మండలాలు: భీమడోలు, చింతలపూడి, దెందులూరు, ద్వారకా తిరుమల, ఏలూరు, గణపవరం, కామవరపుకోట, లింగపాలెం, నల్లజెర్ల, నిడమర్రు, పెదపాడు,పెదవేగి, పెంటపాడు, టి.నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నర్సాపురం

మండలాలు: ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కొవ్వూరు

మండలాలు: అత్తిలి, చాగల్లు, దేవరాపల్లి, ఇరగవరం, కొవ్వూరు, నిడదవోలు, పెనుగొండ, పెనుమంత్ర, పెరవలి, తాళ్లపూడి, తణుకు, ఉండ్రాజవరం


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: జంగారెడ్డిగూడెం, కుక్కునూరు

మండలాలు: బుట్టాయగూడెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు

కృష్ణా

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నూజివీడు

మండలాలు: ఎ.కొండూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయి, గంపలగూడెం, గన్నవరం, ముసునూరు,నూజివీడు, పమిడిముక్కల, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు విసన్నపేట, ఉయ్యూరు


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: విజయవాడ

మండలాలు: చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం,జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: గుడివాడ

మండలాలు: గుడివాడ, గుడ్లవల్లేరు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, నందివాడ, పామర్రు, పెదపారుపూడి, ముదినేపల్లి


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: మచిలీపట్నం

మండలాలు: అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గూడురు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక

గుంటూరు

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: గుంటూరు

మండలాలు: అమరావతి, అచ్చెంపేట, బెల్లకొండ, గుంటూరు, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, ముప్పాళ్ల, పెదకాకాని, పెదకూరపాడు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, రాజుపాలెం, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, వట్టిచెరుకూరు


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: తెనాలి

మండలాలు: అమర్తలూరు, బాపట్ల, బట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నరసరావుపేట

మండలాలు: బొల్లాపల్లి, చిలకలూరిపేట, ఎడ్లపాడు, ఈపూరు, నాదెండ్ల, నరసరావుపేట, నకిరేకల్లు, నూజెండ్ల, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: గురజాల

మండలాలు: దాచేపల్లి, దుర్గి, గురజాల, కారంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, వెల్దుర్తి

ప్రకాశం

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఒంగోలు

మండలాలు: అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: మార్కాపురం, కందుకూరు

మండలాలు: అర్ధవీడు, బెస్తవారిపేట, కంభం, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, మార్కాపురం, పెదారవడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం

దర్శి, దొనకొండ, తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కందుకూరు

మండలాలు: కొండెపి, జరుగుమల్లి, ఎస్‌.కొండ, మర్రిపూడి, సి.ఎస్‌.పురం, గుడ్లూరు, హెచ్‌.ఎం.పాడు, కందుకూరు, కనిగిరి, కె.కె.మిట్ల, లింగసముద్రం, పామూరు, పి.సి.పల్లి, పొదిలి, పొన్నలూరు, తర్లుపాడు, ఉలవపాడు, వెలిగండ్ల, వి.వి.పాలెం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నెల్లూరు

మండలాలు: బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, కొడవలూరు, కోవూరు, మనుబోలు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్‌, పొదలకూరు, రాపూరు, టి.పి.గూడూరు, వెంకటాచలం, విడవలూరు


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కావలి

మండలాలు: అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఆత్మకూరు

మండలాలు: అనంతసాగరం, ఏఎస్‌ పేట, ఆత్మకూరు, చేజర్ల, కలువాయి, మర్రిపాడు, సంగం, సీతారామపురం, ఉదయగిరి, వింజమూరు


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: గూడూరు, నాయుడు పేట

మండలాలు: బాలాయపల్లి, చిల్లకూరు, చిట్టమూరు, డక్కిలి, గూడూరు, కోట, సైదాపురం, వాకాడు, వెంకటగిరి, డి.వి.సత్రం, నాయుడు పేట, ఓజిలి, పెల్లకూరు, సూళ్లూరు పేట, తడ

కర్నూలు

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఆదోని

మండలాలు: ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హలహర్వి, హోలగూడ, ఆస్పరి, కోసిగి, కౌతాలం, మంత్రాలయం, పెద్ద కడుబూర్‌, ఆదోని, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నంద్యాల, కర్నూలు

మండలాలు: ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యావాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నంద్యాల, కర్నూలు

మండలాలు: బనగానపల్లి, కోయిలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, సంజమాల, గడివేముల, పాణ్యం, కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్‌, గూడూరు, కోడుమూరు, కర్నూలు


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఆదోని, కర్నూలు

మండలాలు: మద్దికెర, పత్తికొండ, తుగ్గలి, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, మిడతూరు, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, బేతంచెర్ల, డోన్‌, పీపల్లి, కృష్ణగిరి, వెల్దుర్తి

అనంతపురం

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: పెనుకొండ

మండలాలు: ఆగలి, అమరాపురం, చిలమత్తూరు, గోరంట్ల, గుదిబండ, హిందూపురం, లేపాక్షి, మడకశిర, పరిగి, పెనుకొండ, రొద్దాం, రోళ్ళ, సోమందేపల్లి


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కదిరి

మండలాలు: ఆమడగూర్‌, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట, నల్లచెరువు, నల్లమడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్‌


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ధర్మవరం, కళ్యాణదుర్గం

మండలాలు: రాప్తాడు, బత్తలపల్లి, చెన్నేకొతపల్లి, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, తాడిమర్రి, ముదిగుబ్బ, బెలుగుప్ప, బొమ్మనహళ్‌, బ్రహ్మసముద్రం, డి. హీరేహల్‌, గుమ్మగట్ట, కళ్యాణదుర్గం, కంబదూర్‌, కనేకల్‌, కుందిర్పి, రాయదుర్గం, సెట్టూరు


నాలుగో విడత

రెవెన్యూ డివిజన్‌: అనంతపురం

మండలాలు: అనంతపురం, ఆత్మకూరు, బి.కె. సముద్రం, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్‌, కూడేరు, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపానకాల్‌, యాడికి, ఎల్లనూరు

వైయస్సార్‌ కడప

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: జమ్మలమడుగు, కడప

మండలాలు: పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల, లింగాల, జమ్మలమడుగు, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, పెద్దముడియం, చక్రాయపేట, యర్రగుంట్ల


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: జమ్మలమడుగు, కడప, రాజంపేట

మండలాలు: చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె. ఎన్‌, కలసపాడు, బి.మఠం


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కడప

మండలాలు: రాయచోటి, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, కమలాపురం, వి.ఎన్‌ పల్లి, పెండ్లిమర్రి, సి.కె.దిన్నె, వల్లూరు, చెన్నూరు


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: రాజంపేట, కడప

మండలాలు: కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు, పెనగలూరు, పుల్లంపేట, రాజంపేట, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, టి. సుండుపల్లి, వీరబల్లి

చిత్తూరు

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: తిరుపతి

మండలాలు: బి.ఎన్‌ కండ్రిగ, చంద్రగిరి, కె.వి.బి. పురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచర్ల, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి, వరదయ్యపాలెం, ఏర్పేడు


రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: చిత్తూరు

మండలాలు: బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి


మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: మదనపల్లి

మండలాలు: చిన్నఒట్టిగల్లు, యర్రావారిపాలెం, మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, గుర్రంకొండ, కె.వి. పల్లి, కలకడ, కలికిరి, పీలేరు, వాల్మీకిపురం, బి. కొత్తకోట, కురబలకోట, ములకలచెరువు, పి.టి.యం, పెద్దమండ్యం, తంబళ్లపల్లి


నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: మదనపల్లి

మండలాలు: గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, పుంగనూరు, రొంపిచెర్ల, సోదాం, సోమల, చౌడేపల్లి, బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాని, వి.కోట


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు