
ప్రధానాంశాలు
తిప్పి పంపిన రాష్ట్ర ప్రభుత్వం
ఎస్ఈసీ చర్య నిబంధనలకు విరుద్ధమని, ఏకపక్ష ధోరణితో కూడినదని ప్రస్తావన
అఖిల భారత సర్వీసుల అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని సమాధానం
డీవోపీటీకి లేఖ పంపించిన ఏపీ ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లను అభిశంసిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం వెనక్కి తిప్పి పంపించింది. ఎస్ఈసీ చర్య నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, ఏకపక్ష ధోరణితో ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది. అఖిల భారత సర్వీసుల అధికారులపై చర్యలు తీసుకుంటూ స్వయంగా ఉత్తర్వులు జారీచేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు లేదని వివరించినట్లు సమాచారం. ‘‘అఖిల భారత సర్వీసు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని భావిస్తే.. వారిపై చర్యల కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. ఆ సమాధానం పట్ల ఎస్ఈసీ సంతృప్తి చెందకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ మరోమారు ప్రభుత్వానికి సూచించొచ్చు. అంతే తప్ప నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఆయనకు లేదు’’ అని రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి తిప్పి పంపించిన ప్రొసీడింగ్స్‌కు జతచేసిన లేఖలో వివరించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ)కు కూడా తెలియజేస్తూ లేఖ పంపించినట్లు సమాచారం.
ప్రధానాంశాలు
దేవతార్చన

- అమెరికాలో చిత్తూరుకు చెందిన టెకీ ఆత్మహత్య
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- నేడు ఎస్బీఐ మెగా వేలం..!
- ‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
- సిరాజ్‌పై స్టోక్స్ స్లెడ్జింగ్: రంగంలోకి కోహ్లీ!
- బగ్ గుర్తించి.. ₹36 లక్షలు సాధించి..
- అదృశ్యమైన యువకుల కథ విషాదాంతం