
ప్రధానాంశాలు
భాజపా, జనసేన ఆరోపణ
ఈనాడు, అమరావతి: ఏకగ్రీవాల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కుట్ర పన్నుతోందని భాజపా, జనసేన ఆరోపించాయి. ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న తీరు, పత్రికల్లోని ప్రకటనలు ప్రభుత్వ వైఖరిని మరింత స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నాయి. దీనిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుమోటోగా తీసుకొని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాయి. విజయవాడలోని భాజపా రాష్ట్రశాఖ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. గతంలో హింసాత్మకంగా ఎన్నికలు జరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ‘ఆన్లైన్’ ద్వారా నామినేషన్లను స్వీకరించాలని సోము వీర్రాజు డిమాండు చేశారు. 29లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇరు పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీ చేయాలని భాజపా, జనసేన నిర్ణయించినట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. తిరుపతిలో ఇరుపార్టీలు ఆమోదించిన అభ్యర్థి పోటీ చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై గవర్నరుకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- బాబు గీసిన బొమ్మ.. ఎంజాయ్ చేస్తోన్న అనుపమ
- మార్చి 4 నుంచి రష్మిక మకాం అక్కడే!
- జయసుధను ఇలా చూశారా..?
- సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది?
- బీమాసురులు
- అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
- నటి హిమజకు పవన్ లేఖ
- గృహ రుణాలపై ఎస్బీఐ గుడ్‌న్యూస్
- ఇంగ్లాండ్ కోచ్ ఫిర్యాదు చేయొద్దు: పీటర్సన్