close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజయంతో అతి విశ్వాసం వద్దు

మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో ఇంకా కష్టపడి పని చేయాలి
మంత్రిమండలి సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ‘పంచాయతీల్లో గెలిచామని కూల్‌ అయిపోవద్దు. గెలిచేశాం కదా అని అతి విశ్వాసం వద్దు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు మరింత కష్టపడి పనిచేయాలి. ఎక్కడా రిలాక్స్‌ అవ్వద్దు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రులకు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో, తర్వాత మంత్రులతో విడిగా ముఖ్యమంత్రి వివిధ అంశాలపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ... ‘ఫలితాలు బాగా వచ్చాయి, మీ అందరికీ శుభాకాంక్షలు’ అని మంత్రులకు చెప్పారు. పలువురు మంత్రులు స్పందిస్తూ.. ‘మీరు తీసుకుంటున్న చర్యలు, పథకాల వల్లే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతున్నాం’ అన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్‌ తదితర మంత్రులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. కడప ఉక్కు కర్మాగారం అంశం చర్చకు వచ్చినప్పుడు ‘కర్మాగారం ఏర్పాటులో ప్రభుత్వంతో కలిసి భాగస్వామిగా పనిచేసేందుకు లిబర్టీ స్టీల్స్‌ అర్హత పొందింది. మరో కంపెనీ ఎస్‌ఆర్‌ స్టీల్స్‌ కూడా వచ్చినా.. లిబర్టీ స్టీల్స్‌కు 10-11 పాయింట్లు ఎక్కువ వచ్చాయి. ఆ సంస్థ మొదటి విడతలో రూ.10వేల కోట్లు, రెండో విడతలో రూ.5వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది’ అని మంత్రులకు అధికారులు వెల్లడించినట్లు తెలిసింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు