close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా ఫులె

ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయుడు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమానికి కృషి చేసిన నాయకుడు జ్యోతిబా ఫులె అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ అందరి సంక్షేమమే లక్ష్యంగా పాలిస్తున్నామని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఫులె జయంతి సందర్భంగా తన నివాసంలో సీఎం జగన్‌ ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే జోగి రమేశ్‌, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పాల్గొన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలోనూ ఫులే జయంతిని నిర్వహించారు.

దార్శనికుడు ఫులె: చంద్రబాబు
దేశానికి స్వాతంత్య్రం రావడానికి వందేళ్ల కిందటే వర్ణ, కుల, లింగ వివక్షపై పోరాడిన దార్శనికుడు జ్యోతిబా ఫులె అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. ‘ఆయన స్ఫూర్తితో బీసీల అభ్యున్నతికి మొదటి నుంచి కృషి చేస్తూ తెదేపా బీసీల పార్టీగా పేరుపొందింది. ఫులే జయంతి సందర్భంగా ఆయన చేసిన సామాజిక, దేశ సేవలను స్మరించుకుందాం’ అని ట్వీట్‌ చేశారు.

ఆయన స్ఫూర్తిదాత: పవన్‌కల్యాణ్‌
అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిన మహనీయుడు మహాత్మా ఫులె అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, భావాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఫులె జయంతి పురస్కరించుకొని ఆయనకు అంజలి ఘటించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు