close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సాగరతీరంపై  రక్తపుమరక

పగలు.. ప్రతీకారాలతో సాగరతీరం హోరెత్తింది. ఒక్కరోజే విశాఖపట్నం ప్రాంతంలో పది మంది దారుణ పరిస్థితుల్లో మరణించారు. కుమార్తెకు అన్యాయం జరిగిందన్న పగతో.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని పెందుర్తి మండలం జుత్తాడలో తెలతెల్లవారుతూనే ఓ వ్యక్తి కత్తితో నరికి చంపాడు. మృతుల్లో ఆరు నెలల పసిపాప నుంచి 57 ఏళ్ల ఇంటి పెద్ద వరకూ ఉన్నారు. కుమార్తె పెళ్లి పిలుపులకు వచ్చిన ఓ మహిళా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శరీర భాగాలు వేటికవి విడిపోయేలా, కడుపును చీలుస్తూ.. మెడను నరికి.. అత్యంత ఘోరంగా హతమార్చిన నిందితుడు... ఆ తర్వాత తానే పోలీసులకు ఫోన్‌ చేసి లొంగిపోయాడు. విశాఖ నగరంలో జరిగిన మరో ఘటనలో.. ఖరీదైన అపార్టుమెంటులో ఉంటున్న ఓ కుటుంబం యావత్తూ దారుణ పరిస్థితుల్లో మరణించింది. కనిపెంచిన తల్లిదండ్రులతో పాటు సొంత తమ్ముడినీ ఓ యువకుడు చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చివరకు ఇంట్లో మంటలు, పొగతో తానూ మరణించాడు.


ఆరుగురిని అడ్డంగా నరికేశాడు!
కుమార్తెకు అన్యాయం జరిగిందనే పగతో దారుణం
మృతుల్లో ఆరు నెలలు, నాలుగేళ్ల చిన్నారులు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పెందుర్తి: తన కుమార్తెకు అన్యాయం జరిగిందన్న కోపంతో.. విశాఖ జిల్లాలో గురువారం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా నరికి హతమార్చాడు. తెల్లవారుజామునే ఆ ఇంట్లో రక్తం ఏరులై పారింది. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరినీ నిందితుడు నరికేశాడు. ఆరు నెలల పసిగుడ్డును.. నాలుగేళ్ల చిన్నారినీ వదల్లేదు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి...

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామానికి చెందిన బమ్మిడి రమణ (57) కుమారుడు విజయ్‌కిరణ్‌ వల్ల తన కుమార్తెకు అన్యాయం జరిగిందని.. ఆ పగతోనే బత్తిన అప్పలరాజు అనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. గురువారం తెల్లవారుజామున 6 గంటలకు పాలు తీసేందుకు లేచిన అప్పలరాజు.. రమణ ఇంటికి కుటుంబసభ్యులు వచ్చినట్లు గుర్తించి,. కత్తితో వెళ్లాడు. ఆ సమయంలో బయట శుభ్రం చేస్తున్న రమణ కోడలు ఉషారాణిపై (30) దాడిచేశాడు. ఆమె ప్రతిఘటించడంతో చేతుల మీద కత్తిగాట్లు పడ్డాయి. మెడ మీద నరకడంతో సగం వరకు తెగి.. ఆమె అక్కడే కుప్పకూలింది. దాడి విషయాన్ని గుర్తించిన విజయ్‌కిరణ్‌ తండ్రి రమణ, అత్త అల్లు రమాదేవి (53) మరుగుదొడ్డిలోకి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేయగా.. తలుపు తోసుకువెళ్లి అక్కడే నరికాడు. మరో గదిలో నిద్రిస్తున్న విజయ్‌కిరణ్‌ చిన్నత్త అరుణను (37), చిన్న కుమారుడు ఉదయ్‌ని (4) బలి తీసుకున్నాడు. కిరణ్‌ కుమార్తె లిషితపైనా (6 నెలలు) దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. బయటకొచ్చిన అప్పలరాజు వారిని చంపేశానంటూ కాసేపు కూర్చుని.. తర్వాత 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి స్టేషన్‌లో లొంగిపోయాడు. బాధిత కుటుంబం శివార్లలో ఉండటంతో.. నిందితుడే పోలీసులకు చెప్పేవరకూ ఎవరికీ తెలియలేదు. ఈ ఘటన జరిగినప్పుడు విజయ్‌కిరణ్‌ విజయవాడలో ఉన్నారు. వీరి పెద్ద కొడుకు అఖీరనందన్‌ బుధవారం రాత్రి బంధువుల ఇంటివద్ద ఉండిపోయాడు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

కసితో.. విచక్షణరహితంగా..
ఇంట్లో మృతదేహాలు పడిన తీరు చూస్తే హంతకుడు కసితో రగిలిపోతున్నట్లు కనిపించిందని పోలీసులు భావిస్తున్నారు. రమణ శరీర భాగాలు తెగిపడేలా నరికాడు. అతని మృతదేహాన్ని బయటకు తీసేటప్పుడు శరీర భాగాలు విడిపోయాయి. మరో గదిలో నిద్రిస్తున్న అరుణను చంపి కడుపును చీల్చాడు. అక్కడే నిద్రిస్తున్న నాలుగేళ్ల ఉదయ్‌ని, హాల్లో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారినీ హతమార్చాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాకే బయటకు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పెళ్లికార్డులు పంచడానికి వచ్చి..
మృతుల్లో రమణ తప్ప మిగిలినవారంతా విజయవాడలో ఉంటున్నారు. రమణ 20 ఏళ్ల క్రితం జుత్తాడకు వచ్చి కుటుంబంతో స్థిరపడ్డారు. అప్పలరాజు కుటుంబంతో వివాదాల కారణంగా మూడేళ్ల క్రితం విజయ్‌కిరణ్ తన భార్య, పిల్లలతో విజయవాడ వెళ్లిపోయారు. అరుణ కుమార్తె వివాహం మే 13న ఉందని.. పెళ్లికార్డులు పంచేందుకు బుధవారం రాత్రి జుత్తాడ వచ్చారు. అలా వచ్చి హత్యకు గురవడం అందరినీ కలచివేసింది. మృతిచెందిన రమాదేవి, అరుణ ఇద్దరు రమణకు సొంత చెల్లెళ్లు. రమణ కొడుకు విజయ్‌కిరణ్‌కు రమాదేవి కుమార్తె ఉషారాణితో వివాహం చేశారు.

పగకు కారణమిదీ...

మ్మిడి రమణ, అప్పలరాజు కుటుంబాల మధ్య గతంలో ఉన్న వివాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
* అప్పలరాజు కుమార్తెపై రమణ కుమారుడు విజయ్‌కిరణ్‌ అత్యాచారానికి పాల్పడినట్లు 2018 ఏప్రిల్‌లో కేసు నమోదయింది. ఆమెను ఇంటికి పిలిపించి శీతలపానీయాలు, టీ, కాఫీల్లో మత్తుమందు కలిపి ఆమె మత్తులోకి వెళ్లాక పలుమార్లు లైంగికంగా వేధించాడని, ఇలా 8 నెలల పాటు వేధించాడని అందులో పేర్కొన్నారు. ఆమె అసభ్యకరంగా ఉన్న చిత్రాలను చూపించి విజయ్‌కిరణ్‌ భార్య ఉషారాణి డబ్బులు డిమాండు చేశారని, మరో నలుగురు బెదిరించి డబ్బులు డిమాండు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో పెందుర్తి పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. తన కుమార్తెకు అన్యాయం జరిగిందన్న కోపంతోనే అప్పలరాజు పగ పెంచుకున్నట్లు పోలీసులు చెప్పారు.
* గతంలో విజయ్‌కిరణ్‌పై కేసు నమోదైన మర్నాడే.. అతని భార్య ఉషారాణి స్టేషన్‌కు వెళ్లారు. బత్తిన అప్పలరాజు, శ్రీను, గౌరీష్‌, సన్యాసి అనేవారు తమను అసభ్యకరంగా తిడుతున్నారని, తన భర్త విజయ్‌కిరణ్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పెందుర్తి స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు