Kadapa: పేలిన నిర్లక్ష్యం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kadapa: పేలిన నిర్లక్ష్యం

 కడప జిల్లాలోని ముగ్గురాయి గనుల్లో పేలిన జిలెట¨న్‌ స్టిక్స్‌
 పదిమంది కూలీలు తునాతునకలు
ఎగిరిపడ్డ మృతదేహాలు
 వైకాపా నాయకుల ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్

ఈనాడు డిజిటల్‌-కడప, న్యూస్‌టుడే-కలసపాడు : కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోరప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని తిరుమలకొండ వద్ద ఉన్న ముగ్గురాయి గనుల్లో జరిగిన భారీ పేలుళ్లలో శనివారం పది మంది కూలీలు మరణించారు. భూమి లోపల గనుల తవ్వకాలు జరిపేందుకు వీలుగా వేంపల్లె నుంచి కారులో డ్రైవరు ప్రసాద్‌ శనివారం ఉదయం భారీగా జిలెట¨న్‌ స్టిక్స్‌ను తీసుకొచ్చారు. వాట¨ని కూలీల సహాయంతో భద్రతా చర్యలు తీసుకోకుండా దింపుతుండగా ప్రమాదం జరిగింది. కూలీలు సిగరెట్లు కాల్చేందుకు ప్రయత్నించగా నిప్పురవ్వలు పడి పేలుళ్లు జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పేలుళ్ల ధాట¨కి కూలీల మృతదేహాలు సుమారు 100 అడుగుల మేర తునాతునకలుగా పడిపోయాయి. కొన్ని గుర్తించలేని విధంగా ఉన్నాయి. చెట్లు దెబ్బతినడంతో పాటు ఆకులు పూర్తిగా రాలిపోయాయి. కారు విడిభాగాలు వివిధ చోట్ల పడిపోయాయి. వేముల మండలానికి చెందిన ఈశ్వరయ్య(45), వెంకటరమణ(25), గంగిరెడ్డి(50), లక్ష్మీరెడ్డి(60), సుబ్బారెడ్డి(45), బాలు గంగులు(35), అబ్దుల్‌(30), వేంపల్లె మండలానికి చెందిన వెంకటేష్‌(25), కలసపాడుకు చెందిన బత్తుల ప్రసాద్‌(40), పోరుమామిళ్ల మండలానికి చెందిన కొరివి ప్రసాద్‌(35)లు మృతిచెందారు. సంఘటన స్థలంలో మొత్తం ఆరు మృతదేహాలను పోలీసులు గుర్తించి శవపరీక్షలకు బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నాలుగు మృతదేహాలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. ప్రమాదం జరిగినప్పుడు కొద్ది దూరంలో ఉన్న ఇద్దరు కూలీలు పరారైనట్లు సమాచారం. తహసీల్దారు రామచంద్రుడు ఫిర్యాదు మేరకు కలసపాడు స్టేషన్‌లో వైకాపా సింగిల్‌విండో అధ్యక్షుడు సి.నాగేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మద్దిలేట¨ తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎస్పీ అన్బురాజన్‌, గనులశాఖ రాష్ట్ర సంచాలకుడు వెంకటరెడ్డి, కడప ఏడీ రవిప్రసాద్‌ పరిశీలించారు. ఈ ప్రమాదంపై సమగ్ర నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని గనులశాఖ అధికారులు తెలిపారు. వేంపల్లె నుంచి కలసపాడు ప్రాంతానికి మధ్యలో పలు చెక్‌పోస్టులు ఉన్నా కారులో జిలెట¨న్‌ స్టిక్స్‌ తరలింపును పోలీసులు అడ్డుకోలేకపోవడం చర్చనీయాంశమైంది. అధికారులు, పోలీసుల పర్యవేక్షణ సక్రమంగా ఉండి ఉంటే వారు ప్రాణాలతో బయటపడేవారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

పనులు నిలిపివేయాలని ఆదేశించినా..
మామిళ్లపల్లె గ్రామంలోని 1, 133 సర్వే నంబర్లలో 75.84 ఎకరాల విస్తీర్ణంలో ముగ్గురాయి తవ్వకాల కోసం ప్రస్తుత ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య భార్య సి.కస్తూరిబాయికి 2001లో లీజుకు ఇచ్చారు. దీనికి 20 ఏళ్ల గడువు ఉండగా, 2013లో సి.నాగేశ్వరరెడ్డికి జీపీఏ(జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అట¥ర్నీ) ఇచ్చారు. ఈయన బ్రహ్మంగారిమఠం మండల వైకాపా అధ్యక్షుడు వీరనారాయణరెడ్డి తమ్ముడు. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసినందుకు ఈయనపై పీడీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ గనులపై సంబంధిత అధికారులు గతేడాది తనిఖీలు నిర్వహించి పర్యావరణ అనుమతులు(ఈసీ) లేవని, ఇతర నిబంధనలు పాట¨ంచట్లేదని గుర్తించి లీజుదారులకు నోట©సులు ఇచ్చారు. గతేడాది సెప్టెంబరులో పనులు నిలిపివేయాలని ఆదేశించినా నిబంధనలకు విరుద్ధంగా గనుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం పేలుళ్లు జరిగాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని