Corona: పావుగంటకో ప్రాణం పోతోంది!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: పావుగంటకో ప్రాణం పోతోంది!

 రాష్ట్రంలో 24గంటల్లో 96 మంది మృతి
 కొత్తగా 20,065 కొవిడ్‌ కేసులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో మరణాలను గమనిస్తే ప్రతి పావుగంటకు ఓ కొవిడ్‌ బాధితుడు ప్రాణాలు విడుస్తున్నాడు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య మహమ్మారి కోరల్లో చిక్కి 96 మంది మరణించారు. ఈ స్థాయి మరణాలు రాష్ట్రంలో ఇదే తొలిసారి. పశ్చిమ గోదావరిలో అత్యధికంగా 14 మంది, విశాఖపట్నంలో 12, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పదేసి మంది చనిపోయారు. 24గంటల్లో 1,01,517 నమూనాలు పరీక్షించగా 20,065 (19.76శాతం)మందికి కరోనా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్‌ కేసులు 12,65,439కు, మరణాలు 8,615కు చేరాయి.
12 జిల్లాల్లో వెయ్యికి పైగానే
* విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
* కొత్త కేసుల్లో 10,568 (52.66 శాతం) విశాఖపట్నం, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోనివే.
* మొత్తం క్రియాశీలక కేసులు 1,87,392 ఉంటే.. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లోనే ఇవి 20 వేలు దాటాయి.
* తాజాగా 19,272 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.
* ఇప్పటివరకూ 1,72,62,441 నమూనాలు పరీక్షించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు