84 రోజుల తర్వాతే కొవిషీల్డ్‌ రెండో డోసు అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

84 రోజుల తర్వాతే కొవిషీల్డ్‌ రెండో డోసు అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌

 కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు

ఈనాడు, దిల్లీ: కొవిషీల్డ్‌ రెండో డోసు కాల పరిమితిని 12 నుంచి 16 వారాలకు పెంచినందున ఆ మేరకు కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. దీనిప్రకారం ఇకమీదట లబ్ధిదారులు మొదటి డోసు తీసుకున్న 84 రోజుల తర్వాతే అపాయింట్‌మెంట్‌ తీసుకోడానికి వీలవుతుందని, అంతకుముందు కుదరదని స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే రెండో డోసు కోసం బుక్‌ చేసుకున్న కొవిషీల్డ్‌ లబ్ధిదారుల అపాయింట్‌మెంట్లను కొవిన్‌ రద్దు చేయలేదని, అవి చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపింది. లబ్ధిదారులు వాటిని 84 రోజుల తర్వాతి తేదీలకు రీషెడ్యూలు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం రెండో డోసు కాలపరిమితిని మార్చాలని నిర్ణయించినందున.. అంతకుముందు ఎవరైనా రెండో డోసు కోసం ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని గౌరవించి, వారికి అందించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలాంటి లబ్ధిదారులు టీకా కేంద్రాలకు వస్తే తప్పనిసరిగా వారికి రెండో డోసు ఇవ్వాలని, వెనక్కు పంపడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తాజా మార్పుల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని