సీఎం దిల్లీ పర్యటన వాయిదా

ప్రధానాంశాలు

సీఎం దిల్లీ పర్యటన వాయిదా

అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ లేకనే..

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ పర్యటన వాయిదా పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఖరారైతే ఆయన సోమవారం దిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే ఆదివారం వరకూ హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ విషయం నిర్ధారణ కాకపోవడంతో పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. ఈ వారంలో ఎప్పుడు అపాయింట్‌మెంట్‌ లభిస్తే అప్పుడు సీఎం దిల్లీ వెళతారని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అదే రోజు అందుబాటులో ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని