తిరుమలలో గదుల కేటాయింపు సులభతరం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమలలో గదుల కేటాయింపు సులభతరం

రేపటి నుంచి అందుబాటులోకి 12 నూతన రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు

తిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం శనివారం ఉదయం 8 గంటల నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వసతి గదుల కోసం పేర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది. నూతనంగా జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలోని లగేజ్‌ కౌంటర్‌ వద్ద, బాలాజీ మెయిన్‌ బస్టాండ్‌ వద్ద, కౌస్తుభం అతిథి భవనంవద్ద ఉన్న కారు పార్కింగ్‌ ప్రాంతంలో, రాంభగీచ బస్టాండ్‌ సమీపంలో, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద, సీఆర్వో వద్ద రెండేసి చొప్పున కౌంటర్లలో భక్తులు వసతి కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు తితిదే ఏర్పాట్లు పూర్తి చేసింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎస్సెమ్మెస్‌ ద్వారా కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తారు. అనంతరం వారికి కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చు.  

సుందరకాండ పారాయణానికి ఏడాది పూర్తి
సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద నీరాజనం వేదికపై తితిదే నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం ఏడాది పూర్తి చేసుకుంది. తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం ప్రిన్సిపల్‌ కుప్పా శివసుబ్రహ్మణ్యం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి విభీషణ శర్మ ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుందరకాండ పారాయణం చేస్తున్నారు.

నేటి నుంచి సత్యదేవుడి దర్శనానికి భక్తులకు అనుమతి

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి శుక్రవారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు అవకాశం ఉంటుంది. వ్రతాలు, నిత్య కల్యాణం, ఆర్జిత సేవలు ఈ సమయంలోనే నిర్వహిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని