71 రోజుల తర్వాత 80 వేలకు..
close

ప్రధానాంశాలు

71 రోజుల తర్వాత 80 వేలకు..

తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

దిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజు (ఆదివారం) కొవిడ్‌ కేసుల సంఖ్య లక్షకు దిగువన నమోదైంది. 24 గంటల్లో 80,834 కొత్త కేసులు బయటపడ్డాయి. 71 రోజుల తర్వాత ఇంత తక్కువగా రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తగ్గుముఖం పడుతూ వస్తున్న రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 4.25 శాతానికి చేరింది. ఒక్క రోజులో 3,303 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మరోసారి పాత లెక్కలను సరిచేయడంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే 1,966 రోజువారీ మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రభావం దేశవ్యాప్త మరణాల సంఖ్యపై కనిపించింది. తమిళనాడులో 374 మంది మృతి చెందగా కేరళలో 171, కర్ణాటకలో 144 మరణాలు సంభవించాయి.
* దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,39,989కి చేరగా.. ఇంతవరకు మహమ్మారి బారిన పడి 3,70,384 మంది చనిపోయారు. మరణాల రేటు 1.26%కి పెరిగింది.
* వరుసగా 31వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. ఒక్క రోజులో 1,32,062 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇంతవరకు మొత్తం 2,80,43,446 మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 95.26%కి పెరిగింది. క్రియాశీలక కేసుల సంఖ్య మరింత తగ్గి 10,26,159 (3.49%)కి చేరింది.
* దేశవ్యాప్తంగా శనివారం 19,20,477 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. వారపు పాజిటివిటీ రేటు 4.74 శాతానికి తగ్గింది. దేశంలో ఇంతవరకు 25,31,95,048 కొవిడ్‌ టీకా డోసులు వేశారు.
* మహారాష్ట్రలో గత 3 రోజులుగా ఆడిట్‌ నిర్వహిస్తూ గణాంకాలను సరిచేస్తుండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతూ వస్తోంది. దీంతో ఈ నెల 11 నుంచి 13 వరకూ ఆ రాష్ట్రంలో వరుసగా 1,915, 2,619, 1,966 మరణాలు నమోదయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని