రూ.2.83 లక్షల కోట్ల రుణాలు
close

ప్రధానాంశాలు

రూ.2.83 లక్షల కోట్ల రుణాలు

2021-22లో ఎస్‌ఎల్‌బీసీ రుణ ప్రణాళిక
  గతేడాదితో పోలిస్తే 13% అధికం
  పంట రుణాలుగా రూ.1.10 లక్షల కోట్లు
  ఎంఎస్‌ఎంఈలకు రూ.44,500 కోట్లు
  గృహ నిర్మాణానికి రూ.11వేల కోట్లు

నాడు, అమరావతి: ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో రూ.1.10 లక్షల కోట్లను పంట రుణాలుగా ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఇందులో కౌలు రైతులకు రూ.4,100 కోట్లను కేటాయించారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాల మొత్తం గతేడాది కంటే 15% పెంచి రూ.1,48,500 కోట్లు అందించనున్నారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు రూ.31,041 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్ల రుణ పరపతి కల్పించాలని ఎస్‌ఎల్‌బీసీ ప్రణాళిక రూపొందించింది. ఇది గతేడాది కంటే (రూ.2.52 లక్షల కోట్లు) 13% అధికంగా ఉంది. క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రుణ ప్రణాళికను విడుదల చేయనున్నారు.
* గతేడాది రూ.94,629 కోట్లను పంట రుణాల లక్ష్యం కాగా.. ఈసారి 17% పెంచి రూ.1.10 లక్షల కోట్లు ఇవ్వనున్నారు.
* ప్రాధాన్య రంగానికి 14%, ప్రాధాన్యేతర రంగానికి 9% పెంపు కనిపిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) గతేడాది కంటే 12% పెంచి.. రూ.44,500 కోట్లను రుణాలుగా ఇవ్వనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని