క్రికెట్‌ బంతి పరిమాణంలో బ్లాక్‌ఫంగస్‌
close

ప్రధానాంశాలు

క్రికెట్‌ బంతి పరిమాణంలో బ్లాక్‌ఫంగస్‌

విజయవంతంగా తొలగించిన పట్నా వైద్యులు

పట్నా: బిహార్‌ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఐజీఐఎంఎస్‌)లో 60 ఏళ్ల వ్యక్తి మెదడు నుంచి క్రికెట్‌ బంతి పరిమాణంలో ఉన్న బ్లాక్‌ఫంగస్‌ (మ్యూకర్‌మైకోసిస్‌)ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. జుమాయికి చెందిన అనిల్‌కుమార్‌కు డాక్టర్‌ బ్రజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని వైద్యబృందం గత శుక్రవారం మూడు గంటలపాటు ఈ శస్త్రచికిత్స చేసింది. బాధితుడి పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మనీశ్‌ మండల్‌ మాట్లాడుతూ.. అనిల్‌కుమార్‌ కొవిడ్‌ బారినపడి ఇటీవలే కోలుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అతనికి తల తిరుగుతున్నట్టు ఉండటంతో తమ వద్దకు తెచ్చారని, బ్లాక్‌ఫంగస్‌ బయటపడిందన్నారు. ఈ ఫంగస్‌ ముక్కు నుంచి మెదడుకు చేరిందని, కళ్లకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఇటువంటి కేసు ఆసుపత్రికి రావడం ఇదే ప్రథమం అని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని