శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా విఠపు బాలసుబ్రమణ్యం

ప్రధానాంశాలు

శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా విఠపు బాలసుబ్రమణ్యం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు. శాసనమండలి ఛైర్మన్‌గా ఇటీవల వరకూ కొనసాగిన ఎంఏ షరీఫ్‌ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం ఛైర్మన్‌ స్థానం ఖాళీగా ఉంది. కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునేంతవరకూ బాలసుబ్రమణ్యం ప్రొటెం ఛైర్మన్‌ హోదాలో ఆ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. గవర్నర్‌ కోటాలో ఇటీవల ఎమ్మెల్సీలుగా నియమితులైన తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్‌ యాదవ్‌, మోసేన్‌రాజుతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విఠపు బాలసుబ్రమణ్యం వరుసగా మూడు సార్లు శాసన మండలికి ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని వైకాపా నేత మోసేనురాజు శుక్రవారం కలిశారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని