రాష్ట్రానికి నిధులు విడుదల చేయండి
close

ప్రధానాంశాలు

రాష్ట్రానికి నిధులు విడుదల చేయండి

నిర్మలా సీతారామన్‌కు మంత్రి బుగ్గన వినతి

ఈనాడు, దిల్లీ: వివిధ పద్దులు, పథకాల ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రితో మంగళవారం  ఆయన భేటీ అయ్యారు. అనంతరం బుగ్గన విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌, లాక్‌డౌన్‌ సమస్యలతో గత రెండు మూడు నెలలుగా దిల్లీ రావడం కుదరలేదన్నారు.రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌, పౌర సరఫరాలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలపై అనుశీలన చేసేందుకు దిల్లీ వచ్చినట్లు తెలిపారు. కొవిడ్‌తో ఖర్చులు పెరిగి, రాబడి తగ్గి దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రం, ప్రపంచంలోని అన్ని దేశాలు అప్పుల్లో ఉన్నాయన్నారు. అప్పులు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. లాక్‌డౌన్లతో పనులు లేక.. పేదలు బతికే పరిస్థితి లేదని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాల వద్ద వనరులు లేకపోవడంతో ఆర్థిక భారం పెరిగి అప్పులు తీసుకోవాల్సి వస్తోందని బుగ్గన తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌కు ఇంచుమించు ఉచితంగా చికిత్స అందిస్తోందని చెప్పారు. ఒక్కో బ్లాక్‌ ఫంగస్‌ కేసుకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఖర్చవుతున్నా రాష్ట్రం భరిస్తోందని వెల్లడించారు. అప్పులు చేయొద్దంటే పేదలను వదిలేయమని ప్రతిపక్షాల ఉద్దేశమా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు ప్రభుత్వపరమైన అంశాలపై దిల్లీ వస్తే రాజకీయపరంగా వచ్చారంటూ దారుణమైన విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని