మరో రెండేళ్లు ఛార్జీల మినహాయింపు
close

ప్రధానాంశాలు

మరో రెండేళ్లు ఛార్జీల మినహాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ రాష్ట్రాల మధ్య సౌర, పవన విద్యుత్‌ కేంద్రాల నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌కు అంతర్రాష్ట ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ ఛార్జీల మినహాయింపును కేంద్రం మరో రెండేళ్లపాటు పొడిగించింది. ఇంతకుముందు ఈ మినహాయింపు 2023 జూన్‌ 30 వరకూ అమలులో ఉంది. దీన్ని 2025 జూన్‌30 వరకూ పొడిగిస్తూ కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. హైడ్రో పంప్‌డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్లకు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌  ప్రాజెక్టులకూ ఈ నిబంధనను వర్తింపజేయనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని